Salaar2: ఆ రికార్డ్ ను టచ్ చేయాలంటే వాళ్లిద్దరికే సాధ్యమవుతుందా?

బాహుబలి ది బిగినింగ్ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద 650 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే బాహుబలి ది కంక్లూజన్ మూవీ మాత్రం ఆ సినిమాతో పోల్చి చూస్తే మూడు రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించింది. సలార్1 కూడా ఇప్పటివరకు 650 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఫుల్ రన్ లో మరో 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది.

అయితే సలార్1 కలెక్షన్లు 1000 కోట్లరూపాయల కంటే తక్కువగానే ఉన్నా సలార్2 (Salaar2) మాత్రం బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. బాహుబలి2 కలెక్షన్ల రికార్డ్ లను బ్రేక్ చేసే సత్తా కేవలం ప్రభాస్, రాజమౌళిలకు మాత్రమే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్, జక్కన్న కాంబోలో బాహుబలి3 రావాలని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.

ప్రభాస్, జక్కన్న కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ ఇప్పటికే ప్రకటించిన సినిమాలు పూర్తి కావాలంటే మరో రెండు నుంచి మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రభాస్ ఇతర భాషల్లో సైతం మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ పారితోషికం పస్తుతం 100 నుంచి 110 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు ప్రభాస్ ఏ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారో సమాచారం అందుతోంది. ప్రభాస్ కు ఇన్ స్టాగ్రామ్ తో పాటు ఇతర సోషల్ మీడియా ఖాతాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన తీపికబురును ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది. ప్రభాస్ ఇతర భాషల్లో రాబోయే రోజుల్లో సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus