టాలీవుడ్‌లో స్టార్ బాయ్‌గా గుర్తింపు పొందిన సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ఇప్పుడు మరోసారి తన హ్యాట్రిక్ హిట్ కోసం సిద్ధమవుతున్నాడు. డీజే టిల్లు (DJ Tillu) , టిల్లు స్క్వేర్ (Tillu Square) చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న సిద్ధు, తాజాగా జాక్ (Jack) సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటికే టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఈసారి సక్సెస్ టార్గెట్‌లో ఉన్నాడనే స్పష్టంగా తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) దర్శకత్వం వహించిన ఈ చిత్రం, సిద్ధుకు పూర్తి భిన్నమైన మాస్ యాక్షన్ స్టైల్‌ను అందించనుంది.
బేబీ (Baby) ఫేమ్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మాస్, కామెడీ, ఎమోషన్ అన్నీ కలిపి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ట్రీట్ చేయబోతున్నట్లు టాక్. టిల్లు తరహాలో కాకుండా, ఓ కొత్త యాంగిల్‌తో సిద్ధు కనబడతాడన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే జాక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాం రైట్స్‌ను రూ.9 కోట్లకు, ఆంధ్రా + సీడెడ్ కలిపి రూ.16 కోట్లకు అమ్మినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.
మొత్తంగా రూ.25 కోట్లకు పైగా బిజినెస్ జరగడం ద్వారా, హిట్ కొట్టాలంటే సినిమా గ్రాస్ రూ.40 కోట్ల దాకా వెళ్లాలి. ఇది సిద్ధు కోసం చాలామందిని ఆశ్చర్యపరిచే లెక్క. ఇది అడ్వాంటేజ్ మాత్రమే కాదు, అతని మార్కెట్ ఎలా మారిందన్నదానికి నిదర్శనం. ఈ సినిమాతో సిద్ధు పారితోషికం కూడా దూసుకెళ్లిపోయింది. టిల్లు విజయాల తర్వాత జాక్ కోసం రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడట. మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన సిద్ధు, ఇప్పుడు మాస్ ఆడియెన్స్‌కు, క్లాస్ ఆడియెన్స్‌కు అందుబాటులో ఉన్న యువ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు.
జాక్ హిట్ అయితే టాప్ లీగ్‌లోకి అడుగుపెడతాడన్నది ట్రేడ్ లో విశ్లేషణ. ఇక ఈ సినిమాకు సంగీతాన్ని అచ్చు రాజమణి(Achu Rajamani), సామ్ సీఎస్ (Sam C. S.), సురేష్ బొబ్బిలి (Suresh Bobbili ) ముగ్గురు కలిసి అందించగా.. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad), బాపినీడు భారీ స్థాయిలో నిర్మించారు. ఏప్రిల్ 10న జాక్ విడుదల కానుంది. ఒకవేళ ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తే, సిద్ధు జొన్నలగడ్డకు కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ ఖాయం. ఇకపై అతడి సినిమాలు పెద్ద మార్కెట్‌కి చేరే అవకాశం ఉంది.