Skanda Movie: ఇతర భాషల్లో బోయపాటి శ్రీను సంచలనాలు సృష్టించడం ఖాయమా?

రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. మొదట ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించగా దసరా పండుగకు పోటీ ఎక్కువగా ఉండటంతో ఆ విషయంలో వెనక్కు తగ్గారు. సెప్టెంబర్ నెల 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే స్కంద మూవీకి బోయపాటి శ్రీను అఖండ టచ్ ఇచ్చారని తెలుస్తోంది. స్కంద మూవీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజవుతోంది.

పాన్ ఇండియా మూవీగా (Skanda Movie) ఈ సినిమా తెరకెక్కింది. ఇతర భాషల్లో ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి. బోయపాటి శ్రీను సినిమాలు హిందీలోకి డబ్ అయ్యి ఊహించని స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయడం గమనార్హం. యూట్యూబ్ లో బోయపాటి శ్రీను సినిమాలు సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు. ఇతర భాషల్లో బోయపాటి శ్రీను సంచలనాలు సృష్టించడం ఖాయామని ఫ్యాన్స్ చెబుతుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

రామ్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన నేపథ్యంలో స్కంద మూవీ రామ్ కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రామ్ ఈ సినిమా కోసం లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకోవడంతో పాటు చాలా కష్టపడ్డారని సమచారం. రామ్ పారితోషికం ప్రస్తుతం 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం. భావిస్తున్నారు.

రామ్ కు జోడీగా ఈ సినిమాలో శ్రీలీల ఈ సినిమాలో నటిస్తున్నారు. శ్రీలీల రెమ్యునరేషన్ ప్రస్తుతం 2 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. స్కంద మూవీ 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందని సమాచారం. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఆ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus