Balarkishna: నందమూరి బాలకృష్ణ ఖాతాలో ఈ రికార్డ్ చేరుతుందా?

  • January 22, 2023 / 02:26 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో బాలయ్య హ్యాట్రిక్ సాధించిన సందర్భాలు లేవు. అనిల్ రావిపూడి సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలకృష్ణ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉందని అభిమానులు చెబుతున్నారు. మాస్ ప్రేక్షకులకు నచ్చేలా అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ సినిమాలో అభిమానులకు నచ్చే ఎలివేషన్ సీన్లు ఎక్కువగా ఉండాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ కామెంట్ల విషయంలో అనిల్ రావిపూడి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అటు బాలయ్య అభిమానులకు ఇటు తన అభిమానులకు నచ్చే విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తానని అనిల్ రావిపూడి వెల్లడించారు.ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అనిల్ రావిపూడికి ఈ సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం దక్కుతోందని సమాచారం అందుతోంది. అనిల్ రావిపూడి ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అనిల్ రావిపూడి బాలయ్య కాంబో మూవీ ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అనిల్ రావిపూడి బాలయ్యను ఏ విధంగా చూపిస్తారో చూడాల్సి ఉంది. బాలయ్య కెరీర్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగులు వేస్తున్నారు. సినిమా సినిమాకు లుక్ విషయంలో బాలయ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలయ్య అనిల్ కాంబో మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus