ప్రతి సంవత్సరం 100 సినిమాలు థియేటర్లలో విడుదలైతే ఆ సినిమాలలో 5 సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ సక్సెస్ రేట్ చాలా తక్కువనే సంగతి తెలిసిందే. అయితే ప్రేమలు సినిమా మాత్రం కేవలం 3 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా 113 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించింది. ప్రేమలు (Premalu) సాధించిన కలెక్షన్ల గురించి తెలిసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ కు గురవుతున్నాయి.
ఫిబ్రవరి నెల 9వ తేదీన ఈ సినిమా మలయాళంలో థియేటర్లలో విడుదల కాగా అక్కడ ఈ సినిమా సక్సెస్ సాధించడంతో ఈ మూవీ ఇతర భాషల్లోకి డబ్ అయ్యి తెలుగు, తమిళ భాషల్లో సైతం రిలీజ్ కావడం గమనార్హం. యూత్ ఎక్కువగా కనెక్ట్ కావడం ఈ సినిమా సక్సెస్ కు కారణమని చాలామంది భావిస్తారు. అయితే ప్రేమలు రికార్డ్ ను బ్రేక్ చేయడం ఇప్పట్లో మరో చిన్న సినిమాకు కష్టమేనని తెలుస్తోంది.
బడ్జెట్ కంటే కంటెంట్ ముఖ్యమని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. యూత్ ను టార్గెట్ చేస్తూ అద్భుతమైన కథ, కథనంతో సినిమాను తెరకెక్కిస్తే సక్సెస్ దక్కుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రేమలు సినిమా ఓటీటీలో త్వరలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.
ప్రేమలు సినిమా ఓటీటీలో ఇంకా పెద్ద హిట్ అవుతుందని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి(Rajamouli) కొడుకు కార్తికేయ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయడం గమనార్హం. ప్రేమలు సినిమా సక్సెస్ తో మరిన్ని యూత్ ఫుల్ లవ్ స్టోరీ సినిమాలు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రేమలు సినిమా ఇప్పటికీ తెలుగులో చెప్పుకోదగ్గ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?