2025 సంక్రాంతి పెద్దగా హడావిడి లేకుండా సింపుల్ గా ఉంటుందేమో అని మొదట అనుకున్నారు. 2024 సంక్రాంతి ముగిసిన వెంటనే 2025 సంక్రాంతికి ‘విశ్వంభర’ (Vishwambhara) ‘శతమానం భవతి నెక్స్ట్ పేజీ’ అనౌన్స్ చేశారు. తర్వాత సందీప్ కిషన్ (Sandeep kishan) ‘మజాకా’ కూడా 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు. కానీ తర్వాత ఊహించని విధంగా ‘శతమానం భవతి నెక్స్ట్ పేజీ’ షూటింగ్ ఆగిపోయింది.అజిత్ (Ajith)) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఆ లిస్ట్ లోకి వచ్చి చేరింది.
తర్వాత దసరాకి అనుకున్న బాలయ్య (Nandamuri Balakrishna) – బాబీ (Bobby) ..ల సినిమా, రాంచరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), వెంకటేష్ (Venkatesh) – అనిల్ రావిపూడి(Anil Ravipudi) ..ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాలు వచ్చి చేరాయి. ఇక్కడ కరెక్ట్ గా గమనిస్తే దిల్ రాజు బ్యానర్ నుండే రెండు సినిమాలు వస్తున్నాయి. అలాగే బాలయ్య – బాబీ..ల సినిమాని నైజాంలో రిలీజ్ చేస్తుంది కూడా దిల్ రాజే(Dil Raju) .
ఇదిలా ఉండగా.. అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తోంది. కచ్చితంగా ఆ సినిమా సంక్రాంతికి వస్తుందని.. వాళ్ళు క్లారిటీ ఇచ్చింది లేదు. ఒకవేళ రిలీజ్ చేసినా జనవరి 13 ,15 డేట్లలో రిలీజ్ చేస్తారులే అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాని జనవరి 10నే విడుదల చేయాలని మైత్రి సంస్థ భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ఒకవేళ అదే నిజమైతే కనుక.. ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి ఇబ్బంది తప్పదు. అజిత్ హీరో కాబట్టి తెలుగులో ఎలా ఉన్నా.. తమిళ్ లో బుకింగ్స్ బాగా జరుగుతాయి. అప్పుడు తమిళంలో కూడా విడుదలవుతున్న రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ బుకింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి, అందులోనూ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా కాబట్టి ‘గేమ్ ఛేంజర్’ ఓపెనింగ్స్ అనుకున్న విధంగా నమోదు కావు.