మెగా మేనల్లుడు సాయి ధరమ్ (Sai Dharam Tej) హీరోగా ఎంట్రీ ఇచ్చి ఈ నవంబర్ 14 తో 10 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అతను తన చిన్న మావయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ ఈ 10 ఏళ్లలో చాలా చూశాడు. హీరోగా ఎంట్రీ ఇస్తూనే వరుసగా 3 సక్సెస్ లు పడ్డాయి. ఆ వెంటనే 6 ప్లాపులు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో అతని పై చాలా విమర్శలు వచ్చాయి.
వాటిని తట్టుకుని ‘చిత్రలహరి’ (Chitralahari) తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ వెంటనే ‘ప్రతిరోజూ పండగే’ (Prati Roju Pandage) సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కోవిడ్ టైంలో ఇతనికి బైక్ యాక్సిడెంట్ అయ్యింది. దాని వల్ల ఏడాది పాటు బెడ్ కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని ‘విరూపాక్ష’ (Virupaksha) అనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ వెంటనే తన మావయ్య పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) కలిసి ‘బ్రో’ సినిమాలో నటించాడు. ప్రస్తుతం నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
ఇక సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా తన బెస్ట్ విషెస్ తెలియజేశారు.ఈ సందర్భంగా తన సినీ ప్రయాణానికి మావయ్యలు చేసిన సహాయాన్ని కూడా గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను వదిలాడు. ఇందులో తన పెద్ద మావయ్య చిరంజీవి (Chiranjeevi) దగ్గర నుండి సంకల్పం (డి టెర్మినేషన్) ని నేర్చుకున్నట్టు తెలిపాడు. ఏ పని అనుకుంటే అది పూర్తయ్యేవరకు నిద్రపోను అని తెలిపాడు.
ఇక చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ నుండి కమిట్మెంట్. అంటే ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నామంటే దానికి తగ్గట్టు పని చేయాలి అనే విషయాన్ని నేర్చుకున్నట్టు తెలిపాడు. ఇక నాగబాబు (Naga Babu) మావయ్య దగ్గర నుండి నవ్వుని నేర్చుకున్నాడట. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చిన్న చిరునవ్వు నవ్వేసి దాన్ని దాటేయాలని నాగ బాబు నుండి సాయి ధరమ్ తేజ్ నేర్చుకున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.