Valimai Movie: ‘వలీమై’ కు సూపర్ హిట్ టాక్.. పోటీని తట్టుకుని టార్గెట్ రీచ్ అవుతుందా..!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తెలుగులో కూడా అజిత్ సినిమాలకి క్రేజ్ పెరుగుతుంది. అజిత్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ‘వలీమై’… ఈరోజు అన్ని భాషలతో కలుపుకుని ఈరోజు తెలుగులో కూడా విడుదలైంది. నిజానికి మొదట ఈ చిత్రం ప్రోమోలు అవి చూసి మరో ‘వివేగం’ అవుతుందేమో అని కొందరు విమర్శించారు.పైగా తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా పక్కన ఈ మూవీ రిలీజ్ కాబోతుండడంతో..

Click Here To Watch

‘వలిమై’ ని ఎవ్వరూ పట్టించుకోరేమో అని అంతా అనుకున్నారు. కానీ ‘వలిమై’ మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాలో బైక్ ఛేజింగ్ విజువల్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిని మ్యాచ్ చేసేలా తెరకెక్కాయి. హెచ్. వినోద్ టేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది.ఒక్క క్లాస్ ఆడియెన్స్ అని కాదు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.’ఆర్.ఎక్స్.100′ తర్వాత హిట్టు మొహం చూడని టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ కి కూడా ఈ సినిమా బాగా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ‘వలిమై’ కి ఎక్కువ థియేటర్లు దక్కాయి. రేపటి నుండీ అయితే కష్టం. ‘భీమ్లా నాయక్’ ఎలా ఉన్నా జనాలు ఓసారి చూసెయ్యాలని డిసైడ్ అయ్యారు. కానీ ‘వలిమై’ కి హిట్ టాక్ లభించింది కాబట్టి.. కొన్ని థియేటర్లని హోల్డ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ హోల్డ్ చేసిన థియేటర్లకు జనాలు కూడా వస్తే ఈ వీకెండ్ కు తెలుగులో అయితే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ రూ.2.6 కోట్ల వరకు జరిగింది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus