Veera Simha Reddy: అవి రివీల్ కాకుండా గోపీచంద్ మలినేని జాగ్రత్త పడుతున్నారా?

  • December 17, 2022 / 12:14 AM IST

స్టార్ హీరో బాలయ్య హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి కేవలం 25 రోజుల సమయం మాత్రమే ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ బాలయ్య అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారు. ఈ మధ్య కాలంలో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్న సందర్భాలు తక్కువ కావడంతో వీరసింహారెడ్డి రిజల్ట్ విషయంలో ఫ్యాన్స్ కు ఒకింత టెన్షన్ పెరిగింది. అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని మాత్రం బాలయ్య ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా

ఏ మాత్రం నిరాశపరచనని నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అదే సమయంలో గోపీచంద్ మలినేని ఈ సినిమాలోని కథకు సంబంధించి ఎలాంటి వివరాలు లీక్ కాకుండా గోపీచంద్ మలినేని జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఆసక్తికర ట్విస్ట్ లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య అభిమానులతో పాటు సాధారణ అభిమానులకు కూడా కచ్చితంగా నచ్చేలా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. క్రాక్ సినిమాలో ప్రేక్షకులకు చాలా అంశాలు నచ్చేలా ఉండగా

ఆ సినిమాకు రెట్టింపు స్థాయిలో వీరసింహారెడ్డి సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వీరసింహారెడ్డి సినిమాకు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. బాలయ్య సైతం సినిమా రిజల్ట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్దమయ్యారు. గతేడాది నుంచి బాలయ్యకు లక్ కూడా కలిసొస్తోంది.

అందువల్ల బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో కూడా రికార్డులు బ్రేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమయ్యాయి. బాలయ్య ఈ మూవీకి 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను తీసుకున్నారు. బాలయ్య, శృతి కాంబినేషన్ చాలా బాగుందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. బాలయ్య శృతి కాంబోకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus