Veera Simha Reddy: అలా చేస్తే వీరసింహారెడ్డి రికార్డులు సృష్టిస్తుందా?

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డి జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అదే రోజు థియేటర్లలో వారసుడు మూవీ కూడా థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం. ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తైందని సమాచారం. ఒక పాట షూటింగ్ మాత్రం పెండింగ్ ఉండగా అతి త్వరలో ఆ సాంగ్ షూట్ ను పూర్తి చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగానే జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.

ఈ సినిమాకు భారీగానే థియేటర్లు దొరికాయని తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా ఒకరోజు ఆలస్యంగా థియేటర్లలో రిలీజ్ అవుతుండటంతో ఆ సినిమా కోసం కేటాయించిన థియేటర్లలో కూడా వీరసింహారెడ్డి రిలీజ్ కానుంది. తొలిరోజు కలెక్షన్ల విషయంలో వీరసింహారెడ్డి పైచేయి సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే కొంతమంది అభిమానులు మాత్రం ఈ సినిమాకు బాహుబలి స్ట్రాటజీని ఉపయోగిస్తే కలెక్షన్లు పెరుగుతాయని చెబుతున్నారు. జనవరి 11వ తేదీ సెకండ్ షో నుంచి వీరసింహారెడ్డి రిలీజ్ చేస్తే సినిమా కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ స్ట్రాటజీని ఫాలో అవుతారో లేదో చూడాల్సి ఉంది. 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా త్వరలో ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ కానుంది. అఖండ సక్సెస్ తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

బాలయ్య, శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమ ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. బాలయ్య ఈ సినిమాకు కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఈ సినిమాలో మాస్ ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉన్నాయని బోగట్టా.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus