Vijay: ‘వారసుడు’కి అవసరమైన బూస్ట్‌ ఇచ్చేదెవరు..?

‘వారసుడు’ సినిమాను సంక్రాంతి సీజన్‌లో తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అవును, మాకెందుకు తెలియదు సినిమా విడుదల విషయంలో పెద్ద చర్చే జరుగుతోంది కదా అంటారా? అవును మీరు చెప్పింది నిజమే.. అయితే ఆ సినిమా రిలీజ్‌కి ఆ ప్రచారం సరిపోతుందా? చిరంజీవి, బాలకృష్ణ ముందు విజయ్‌ సినిమా నిలబడుతుందా? ఈ ప్రశ్న మాది కాదు. సోషల్‌ మీడియాలో గతకొద్ది రోజుల నుండి వినిపిస్తున్న మాటే ఇది. దీనికి పరిష్కారం కనుగొనే పనిలో ఉందట దిల్ రాజు టీమ్‌.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు ‘వరిసు’ పేరుతో విజయ్‌ హీరోగా ఓ తమిళ సినిమా తెరకెక్కించారు. తొలుత బైలింగ్వుల్‌ అని చెప్పినా ఆ తర్వాత తమిళ సినిమానే అని తేల్చేశారు. ఆ సినిమాను సంక్రాంతి కానుకగా ‘వారసుడు’ పేరుతో తెలుగులో డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తమిళ ప్రమోషన్స్‌ ఇటీవల మొదలయ్యాయి. దీంతో తెలుగులో ప్రమోషన్స్‌ ఎప్పుడు, అసలు ఉంటాయా, ఉంటే విజయ్‌ వస్తాడా అనే చర్చ జోరుగా నడుస్తోంది.

గత సందర్భాల బట్టి చూస్తే.. డబ్బింగ్‌ సినిమాల ప్రచారం కోసం విజయ్‌ తెలుగు రాష్ట్రాలకు పెద్దగా వచ్చింది లేదు. ఇప్పుడు ‘వారసుడు’ కోసం వస్తాడా అనేదే చర్చ. వస్తే మాత్రం కచ్చితంగా సంక్రాంతి వార్‌ గురించి ప్రశ్నలు ఉంటాయి. దిల్‌ రాజు తమిళనాట రాజేసిన విజయ్‌ X అజిత్‌ టాపిక్‌ గురించి కూడా ప్రశ్నల వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్‌ వస్తాడా? వస్తే మాట్లాడతాడా అనేది తెలియాల్సి ఉంది.

అయితే ‘వారసుడు’ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బజ్‌ ఏమాత్రం సరిపోదు అనేది మాత్రం పక్కా. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ లాంటి మాస్ హీరోల ఇమేజ్‌ ముందు విజయ్‌ ఇమేజ్‌ తెలుగులో నిలవదు. తమిళంలో విజయ్‌ స్టార్‌ కావొచ్చు కానీ.. తెలుగులో ఆ స్థాయి ఇంకా రాలేదు. బి, సి సెంటర్లలో అయితే ఇంకానూ, దీంతో ఎలా అయినా విజయ్‌ను తెలుగు రాష్ట్రాలకు, కనీసం హైదరాబాద్‌కి తీసుకొచ్చి ప్రచారం చేయించాలని దిల్‌ రాజు అనుకుంటున్నారు. మరి విజయ్‌ వస్తాడా అనేది చూడాలి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus