‘లైగర్‌’ కోసం విజయ్‌ కొత్తగా రెడీ అవుతున్నాడట

విజయ్‌ దేవరకొండకు ధైర్యం ఎక్కువ. ‘అర్జున్‌ రెడ్డి’ లాంటి కథను ఎంచుకున్నప్పుడే ఈ విషయం అర్థమైపోయింది. ఆ తర్వాత ఒకటి రెండు బ్యాడ్‌ పిక్స్‌ వచ్చినా… క్రేజ్‌ మాత్రం అలా ఉండిపోయింది. ‘గీత గోవిందం’తో సగటు కుర్రాడిలా కనిపించి… ఇంకా అభిమానులకు చేరువైపోయడు. ‘అర్జున్‌ రెడ్డి’ కుర్రాళ్లను కనెక్ట్‌ చేస్తే… ‘గీత గోవిందం’ అమ్మాయిలను కనెక్ట్‌ చేసింది. అందుకే పాన్‌ ఇండియాకు రెడీ అయిపోయాడు. పూరి జగన్నాథ్‌ డైరక్షన్‌లో ‘లైగర్‌’ చేస్తున్నాడు. ఈ సినిమా క్రేజ్‌ మామలుగా లేదు. అందుకే దీని కోసం విజయ్‌ మరో రిస్క్‌ చేయడానికి సిద్ధమయ్యాయడట.

‘లైగర్‌’ సినిమా మొదలై చాలా రోజులైంది. అయితే కరోనా – లాక్‌డౌన్‌ కారణంగా పూర్తవ్వడంలో ఆలస్యమవుతూ వచ్చింది. ఇటీవల పనులు మళ్లీ ఊపందుకున్నాయి. టైటిల్‌ ప్రకటన, విడుదల తేదీ ప్రకటన లాంటివి జరిగిపోయాయి. ఇప్పుడు సినిమా డబ్బింగ్‌ పనులు కూడా మొదలుపెడతారట. ఇక్కడే రిస్క్‌ విషయం తెలుస్తోంది. తెలుగులో ఎలాగూ విజయ్‌ డైలాగ్స్‌ చెప్పుకుంటాడు. అయితే బాలీవుడ్‌లో కూడా విజయ్‌ వాయిసే వినిపించబోతోందట. ఎందుకంటే ఈసినిమా సొంత డబ్బింగ్‌ చెప్పుకుందామని విజయ్‌ అనుకుంటున్నాడట.

ఇటీవల విజయ్‌ ముంబయి వెళ్తున్నట్లు కొన్ని ఫొటోలు షేర్‌ చేశాడు. షూటింగ్‌ మొదలుపెట్టేశాడు కూడా. ప్యారలల్‌గా డబ్బింగ్ కొనసాగుతుందట. ఈ లోగా హిందీ డైలాగ్స్‌ కోసం విజయ్‌ కొన్ని క్లాసులు తీసుకుంటున్నాడట. బేసిక్‌గా హైదరాబాదీ కుర్రాడు కావడంతో హిందీ మీద పట్టు ఉంటుంది. అయితే ఫక్తు బాలీవుడ్‌ స్టయిల్‌ హిందీ రాదు. దీని కోసమే ఈ స్పెషల్‌ క్లాస్‌లట. అయితే బాలీవుడ్‌లో తొలి సినిమా విషయంలో విజయ్‌ తీసుకుంటున్న రిస్క్‌ను చూసి కొందరు మెచ్చుకుంటుంటే, ఇంకొందరు ఎందుకు అవసరమా అంటున్నారు.

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus