Samantha: యశోద అంటే ఎవరో తెలుసుగా?.. దీని అర్థం అదేనా?

సినిమా టీజర్‌, ట్రైలర్‌ చూసి సినిమా కథ చెప్పేయొచ్చా అంటే.. ఒక్కోసారి చెప్పేయొచ్చు అనే సమాధానమే వస్తుంది. కారణం కొన్ని ట్రైలర్‌లు, టీజర్లు అలా ఉంటాయి కాబట్టి. తాజాగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్న చిత్రం ‘యశోద’. సమంత ప్రధాన పాత్రలో హరి – హరీశ్‌ తెరకెక్కించిన ఈ సినిమా కథ ఇదే అంటూ గురువారం సాయంత్రం నుండి ఓ కథ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా సరోగసీ నేపథ్యంలో సాగుతుంది అని క్లారిటీ వచ్చేసింది. అయితే కథ అంతేనా.. ఇంకా ఏమైనా ఉందా అనే ప్రశ్న వినిపిస్తోంది.

ట్రైలర్‌లో చూపించిన దాని ప్రకారం.. యశోద అలియాస్‌ సమంత పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయి.. ఆర్థిక పరమైన అవసరాల కోసం సరోగసీ ద్వారా ఓ బిడ్డను కందాం అనే డీల్‌కి ఒప్పుకుంటుంది. దీంతో ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులిస్తారు. ఆ తర్వాత ఆమెను ఓ భారీ బిల్డింగ్‌లోకి తీసుకెళ్తారు. పేదలు కలలో కూడా చూడనంత భారీగా, అన్ని సౌకర్యాలతో ఉంటుందీ ఆ బిల్డింగ్‌. అక్కడ తన లాంటివాళ్లు చాలామంది ఉంటారు. అలా సరోగసీ ద్వారా కన్న పిల్లలు.. ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీల బిడ్డలు అని తెలుస్తుంది.

అయితే అక్కడే మరో విషయం కూడా తెలుసుకుంటుంది సమంత. బిడ్డను కన్న తర్వాత.. ఆ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణిస్తోందని ఆమెకు అర్థమవుతోంది. దీంతో ఎలాగైనా తనను తాను కాపాడుకోవాలని, తనతోపాటు ఉన్నవారిని కాపాడాలని అనుకుంటుంది. దాని కోసం అక్కడే వైద్యుడిగా పని చేస్తున్న ఉన్ని ముకుందన్‌ సాయంతో బయటపడాలని చూస్తుంది. ఈ ఇద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ కూడా ఉంటుంది అనుకోండి. బయటపడి, అక్కడి మోసాల్ని బయటపడేసే క్రమంలో ఆమె ఎలాంటి చిక్కులు ఎదుర్కొంది, ఎలా సాధించింది అనేదే సినిమా.

ఈ సినిమాలో సరోగసీ కేంద్రం నిర్వాహకురాలిగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటించింది. అయితే ఆమెకు వేరే బాస్‌ ఒకరు ఉంటారని టాక్‌ నడుస్తోంది. ఇందులో రాజకీయ నాయకులు, పోలీసులు, అంతర్జాతీయ కుట్రలు ఉంటాయని సమాచారం. ఇప్పటికే సరోగసీ, సెలబ్రిటీల వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఈ సమయంలో ఇలాంటి కథ ఎంచుకుని సమంత.. తేనె తుట్టెను కదిలిస్తోందని అంటున్నారు. అంతేకాదు.. సినిమా క్లైమాక్స్‌లో పెద్ద ట్విస్ట్‌ ఉంటుందని, సమంత ఓ పోలీసు అధికారిగా కూడా కనిపించనుందని కొంతమంది నెటిజన్లు అనుకుంటున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus