YVS Chowdary: ఆ విషయంలో టాలీవుడ్ కి వైవిఎస్ చౌదరి హెల్ప్ చేస్తాడా?

టాలీవుడ్లో హీరోయిన్ల కొరత చాలా ఉంది. ఇది కొత్త టాపిక్ కాదు. ఎప్పుడూ ఉండేదే..! ఇప్పుడైతే అది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  వంటి హీరోయిన్లు సీనియర్ హీరో అయిన వెంకటేష్  (Venkatesh)  సరసన కూడా చేయాల్సి వస్తుంది. మరోపక్క ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగుతున్న వాళ్ళ హవా కూడా క్లైమాక్స్ కి వచ్చేసింది. శ్రీలీలకి (Sreeleela)  ఇప్పుడు ఎక్కువ ఆఫర్లు లేవు. ఆమె మిడ్ రేంజ్ హీరోల సరసన చేయాల్సి వస్తుంది. భాగ్య శ్రీ బోర్సే ప్రస్తుతం లీడ్లో ఉంది.

YVS Chowdary

ఆమె తర్వాత అంటే ఎవరు అంటే ఇప్పుడు సమాధానం లేదు. సో ఇప్పుడు మరో హీరోయిన్ టాలీవుడ్ కి అవసరం. మనకంటే కూడా తమిళ పరిశ్రమలో ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. తెలుగులో క్లిక్ అయిన హీరోయిన్లని కోలీవుడ్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. సో తెలుగులో క్లిక్ అయ్యే హీరోయిన్లకి కోలీవుడ్లో కూడా ఢోకా ఉండదు. సరిగ్గా ఇలాంటి టైంలో వైవిఎస్ చౌదరి (YVS Chowdary) ఓ కొత్త అమ్మాయిని పరిచయం చేస్తున్నాడు. ఆమె పేరు వీణా రావ్.

చాలా కాలం తర్వాత వైవిఎస్ చౌదరి (YVS Chowdary)  దర్శకుడిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దివంగత నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) గారి మనవడు, దివంగత నందమూరి జానకిరామ్ (Janaki Ram Nandamuri) తనయుడు నందమూరి తారక రామారావుని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు. అందులో వీణా రావ్ అనే తెలుగమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు. ‘అచ్చ తెలుగు అందాలరాశి మరియు కూచిపూడి నర్తకి’ అంటూ ఈరోజు వీణా రావ్ ని పరిచయం చేశాడు వైవిఎస్. చూడటానికి ఆమె చాలా చక్కగా కనిపిస్తుంది.

ఆమె ఫోటో షూట్ కి సంబంధించిన పిక్స్ లో చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో వీణా రావ్ గ్లామర్ పరంగా ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమె పాత్ర కూడా క్లిక్ అయ్యి మంచి పేరు వస్తే.. టాలీవుడ్ కి ఉన్న హీరోయిన్ల కొరత కొంతవరకు తీరినట్టే. గతంలో వైవీఎస్ పరిచయం చేసిన ఇలియానా (Ileana) , అంకిత (Ankitha) వంటి హీరోయిన్లు కూడా కొంతకాలం బిజీగా గడిపారు. ఆ లిస్టులోకి వీణా రావ్ కూడా చేరుతుందేమో చూడాలి

డైరెక్టర్ కంటే స్టోరీ రైటర్..కే ఎక్కువ ఎఫెక్ట్ పడిందిగా…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus