పిక్‌ టాక్‌: ‘అఖండ’ థియేటర్‌ దగ్గర అదిరిపోయే సీన్‌

సినిమా రిలీజ్‌లు అంటే… ఒకప్పుడు థియేటర్ల ముందు చాలా సందడి కనిపించేది. టికెట్ల కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడటాలు, టికెట్‌ దొరికినప్పుడు వేసే గంతులు, టికెట్‌ దొరకని వారి నిట్టూర్పులు… ఇలా అదో పండగలా ఉండేది. వీటికితోడు… మనం ఎప్పటికీ మరచిపోని ఓ సీన్‌ కూడా ఉంటుంది. అదే చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ల నుండి ట్రాక్టర్లు వేసుకొని వచ్చి సినిమాలు చూడటం. ఆ రోజులు ఎంతైనా గొప్పే. టాలీవుడ్‌క చాలా రోజుల తర్వాత ‘హౌస్‌ఫుల్‌’ సందడిని తీసుకొచ్చిన చిత్రం ‘అఖండ’.

బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. వాటి గురించి కాసేపుప పక్కన పెడితే… గుంటూరు జిల్లాలోని ఓ థియేటర్‌ దగ్గర ఇటీవల కనిపించిన ఓ ఫొటో… అలనాటి రోజుల్ని గుర్తు చేస్తోంది. జిల్లాలోని పెదనండిపాడులోని ఓ థియేటర్‌లో ‘అఖండ’ ఆడుతోంది. ఆ సినిమా కోసం పరిసర ప్రాంత మహిళలు ట్రాక్టర్‌ కట్టుకొని మరీ వచ్చారు. దీంతో ఆ ఫొటో చూసి టాలీవుడ్‌లో ఎప్పుడో 20 – 25 ఏళ్ల క్రితం కనిపించిన సందడి మళ్లీ కనిపిస్తోంది అంటూ మురిసిపోతున్నారు.

ఎంతైనా ఆ రోజులు గోల్డెన్‌ డేస్‌ అనే చెప్పాలి. అలాంటి రోజుల్ని మళ్లీ వెనక్కి తెచ్చిన జోడీ బాలయ్య – బోయపాటి. ఈ సినిమా ఇటీవల వంద కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇలా ట్రాక్టర్ల మీద జనాలు వస్తున్నారంటే ఈ సినిమా రికార్డులు ఇంకా ఉన్నాయనిపిస్తోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus