Vijayendra Prasad: అకీరా ఎంట్రీ గురించి విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ కొడుకు అకీరా నందన్ సినీ ఎంట్రీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అకీరా నందన్ స్వయంగా స్పందిస్తే అకీరా సినీ ఎంట్రీకి సంబంధించిన సందేహాలు తొలగిపోయే అవకాశం ఉంది. టైగర్ నాగేశ్వరరావు సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి, అకీరా గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేణూ దేశాయ్ గారు.. మీరు సినిమాలకు దూరంగా ఉండవచ్చని అయితే మాకు మాత్రం దగ్గరేనని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

మీ కొడుకు అకీరా నందన్ ను వీలైనంత త్వరగా హీరోగా చేయాలని ఆ సినిమాలో మీ కొడుకుకు మీరే తల్లిగా నటించాలని విజయేంద్ర ప్రసాద్ రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం దసరా సీజన్ నడుస్తోందని అమ్మవారి విగ్రహం టైగర్ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆ టైగర్ ను ఏ విధంగా ఆపలేరో ఈ టైగర్ నాగేశ్వరరావును సైతం అదే విధంగా ఆపలేరని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

ఈ దసరా ఈ సినిమాదే అని ఈ సినిమా దర్శకుడు నా మనస్సు దోచేశాడని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. రవితేజ నటించిన విక్రమార్కుడు మూవీ చాలా భాషల్లో రీమేక్ అయిందని అయితే రవితేజ ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేకపోయారని ఆయన కామెంట్లు చేశారు. టైగర్ నాగేశ్వరరావు విషయంలో విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) నమ్మకం నిజమవుతుందేమో చూడాలి.

గట్టి పోటీతో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతూ ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. రవితేజ అభిమానులు టైగర్ నాగేశ్వరరావు 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రవితేజ రాబోయే రోజుల్లో సినీ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. టైగర్ నాగేశ్వరావు సినిమా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి కెరీర్ కు కీలకం కానుంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus