ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా యమా డ్రామా ట్రైలర్ లాంచ్

  • October 5, 2020 / 08:53 PM IST

ఫిల్మీ మ్యాజిషియన్స్ పతాకం పై సుకన్య సమర్పణలో హీరో సాయి కుమార్ యముడిగా టి. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యమ డ్రామా. ఈ చిత్రానికి టి. రామకృష్ణ రావు నిర్మాత. యముడి కథలతో ఎప్పుడు సినిమాలు తెరకెక్కినా వాటికీ మంచి క్రేజ్ ఉంటుంది. యముడి కథలతో వచ్చిన యమ గోల, యముడికి మొగుడు, యమ దొంగ, యమ లీల తదితర చిత్రాలు విజయాన్ని అందుకోవడంతో.. లవ్ ఎమోషనల్ డ్రామాతో ఈ యమ డ్రామాని దర్శకుడు ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యమ డ్రామా చిత్రం ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీద లాంచ్ చేసింది చిత్ర బృందం.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ: రెండు జంటల మధ్యన లవ్, ఎమోషన్, యముడి రాసే తల రాతలు ఎలా ఉంటాయో అనేది ఈ యమ డ్రామా ట్రైలర్ లో దర్శకుడు హర్ష అద్భుతంగా చూపించాడు. యమ డ్రామా సినిమా విజయాన్ని అందుకోవాలని, చిత్ర బృందం సక్సెస్ సాధించాలని అలాగే దర్శక నిర్మాతలు హర్ష, టి రామకృష్ణ రావు లను ప్రత్యేకంగా అభినందించారు.

దర్శకుడు హర్ష మట్లాడుతూ: అనిల్ రావిపూడి గారు తన సినిమా పనిలో చాలా బిజీగా వున్నా కూడా మా మీద ఉన్న ప్రేమ తో ఆయన మా యూనిట్ కి తన సలహాలు ఇస్తూ, ఈ సమయాన్ని కేటాయించినందుకు చాలా ఆనందంగా వుంది. యమ డ్రామా ట్రైలర్ అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా విడుదలవడం సంతోషం. యువత చిన్న సమస్యలకు, ఒత్తిళ్లకు లొంగిపోయి కన్నీళ్లు కారిస్తే కాదు.. చమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలరు అనేది తెలుసు కోవాలి అంటూ యూత్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మా చిత్రం తప్పకుండా మంచి సక్సెస్ అవుతుంది అని భావిస్తున్నట్లుగా చెప్పారు.

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus