‘కేజీఎఫ్’ రికార్డులు ఆగట్లేదుగా…?

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కే.జి.ఎఫ్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2018 డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విదులయ్యింది. మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది ఈ చిత్రం. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కన్నడంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఇప్పటికీ రికార్డు కలెక్షన్లను రాబడుతుంది. బంగారు గనుల మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం… ఇప్పటివరకూ హిందీ వెర్షన్ ద్వారా 26 కోట్లకి పైగా వసూళ్ళను రాబట్టి రికార్డు సృష్టించింది.

తెలుగు రాష్ట్రాల్లో ‘కే.జి.ఎఫ్’ చిత్రం దాదాపు 7.5 కోట్ల షేర్ వసూలు చేసి… 10 కోట్ల షేర్ మార్క్ దిశగా దూసుకుపోతుండడం విశేషం.ఒక పక్క ‘అంతరిక్షం’ ‘పడి పడి లేచె మనసు’ చిత్రాలు ఉన్నప్పటికీ ఒక కన్నడ చిత్రమైన ‘కే.జి.ఎఫ్’ దూసుకెళ్ళడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 150 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ సినిమాతో యశ్ రేంజ్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఒక కన్నడ డబ్బింగ్ చిత్రం ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం ఇదే మొదటి సారి అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన తీరుకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఫుల్ రన్లో ఈ చిత్రం ఇంకెన్ని అద్భుతాలను నమోదు చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus