ఇదేం ట్విస్ట్ యష్… ఇందులో నిజం లేదా..?

‘బాహుబలి’ తరువాత మన సౌత్ చిత్రం గురించి ఎక్కువగా మాట్లాడుకుంది ఏదైనా ఉందా అంటే అది ‘కె.జి.ఎఫ్’ చిత్రం గురించి మాత్రమే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యష్ హీరోగా నటించిన ఈ చిత్రం ఒక్క తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఓ కన్నడ చిత్రం ఇంత పెద్ద విజయాన్ని నమోదు చేసింది కూడా ‘కె.జి.ఎఫ్’ చిత్రమే..! ఇక ‘కె.జి.ఎఫ్’ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఇందులో రాఖీ బాయ్ లుక్ ఇదేనంటూ ఓ లుక్ బయటకి వచ్చిన సంగతి తెలిసిందే..!

ఈ లుక్ లో రాఖీభాయ్ అదేనండీ యష్ పొడవాటి జుట్టుతోనూ, గడ్డంతోనూ కనిపిస్తున్నాడు. అయితే ఈ లుక్కే ఫైనల్ అని అంతా ఫిక్సయిపోయారు. కానీ ఇది నిజం కాదని యష్ షాకిచ్చాడు. ” ‘కె.జి.ఎఫ్2’ లో నా లుక్ ను ఇప్పుడే బైట పెట్టే ఆలోచన లేదు. ప్రేక్షకులకి నా లుక్ పై ఉండే ఆసక్తిని మరికొన్ని రోజులు కంటిన్యూ చేస్తాను.. అయితే వారి ఎక్స్ పెక్టేషన్స్ ను మాత్రం కచ్చితంగా రీచ్ అవుతాము” అంటూ ఇటీవల ఓ సందర్భంలో యష్ చెప్పుకొచ్చాడు. ‘దీనిని బట్టి చూస్తే ఆ లుక్ ‘కె.జి.ఎఫ్2′ లో యష్ లుక్ ఇది కాదని’ కొందరు డిస్కస్ చేసుకుంటున్నారు. ‘మరి ఇది నిజమేనా లేక యష్ బిస్కట్ వేశాడా’ అని మరికొందరు డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ఏది నిజమనేది అధికారికంగా చిత్ర యూనిట్ లుక్ ను రిలీజ్ చేసే వరకూ చెప్పలేం..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus