Yashoda OTT: యశోద మూవీ ఓటీటీ రిజల్ట్ ఏంటో తెలుసా?

నెల రోజుల క్రితం సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కి థియేటర్లలో విడుదలైన యశోద మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఫస్ట్ వీకెండ్ వరకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాలేదు. అయితే టార్గెట్ తక్కువ కావడంతో ఆలస్యంగానైనా అన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. అయితే ఓటీటీలో కూడా ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది.

ఓటీటీలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ సినిమా మరీ గొప్పగా ఉందని చెప్పడం లేదు. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ సినిమా యావరేజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సమంత ప్రస్తుతం ఆరోగ్య సమస్యల వల్ల మీడియాకు దూరంగా ఉండటం కూడా ఈ సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపింది. అయితే సమంత అభిమానులకు మాత్రం యశోద సినిమా ఎంతగానో నచ్చేసింది.

సమంత ఫ్యాన్స్ మాత్రం థియేటర్లలో యశోద మూవీని చూడటం మిస్సైన వాళ్లు ఓటీటీలో కచ్చితంగా చూడాలని చెబుతున్నారు. మరోవైపు శాకుంతలం మూవీకి సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సమంత పూర్తిస్థాయిలో కోలుకుని త్వరలో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొని బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సామ్ రేంజ్ పెరుగుతుండగా సమంత ప్రస్తుతం ఖుషి మూవీలో నటిస్తున్నారు. అటు విజయ్ దేవరకొండకు ఇటు సమంతకు ఈ సినిమా కీలకమనే సంగతి తెలిసిందే. ఖుషి సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus