అభిమానుల క్రియేటివిటీ ఈ మధ్య ఎక్కువైపోతోంది. సోషల్ మీడియాలో సినిమా టీమ్ చేసే సందడి కంటే వారిదే ఎక్కువగా ఉంటోంది అని చెప్తే అతిశయోక్తి కాదేమో. ఈ విషయం మీకేమైనా డౌట్ ఉంటే.. యశ్ రాజ్ ఫిల్మ్స్ వాల్ల ఎక్స్ అకౌంట్ చూడండి. రెండో పోస్టులో ఆసక్తికరమైన వీడియో కనిపిస్తుంది. ఆ క్రియేటివిటీని చూస్తే మీకు కూడా ఆశ్చర్యమేస్తుంది. ఈ క్రమంలో ‘వార్ 2’ (War 2) సినిమా మీద రీసెంట్‌గా వచ్చిన రూమర్స్ గురించి క్లారిటీ వస్తుంది కూడా.
హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (Jr NTR) కలసి నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. ఈ సినిమా విడుదలకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా, సమాచారం రాలేదు. అయితే పుకార్లు మాత్రం వస్తున్నాయి. అయితే గతంలోనే ఆగస్టు 14న తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇటీవల జరుగుతున్న వివిధ పరిణామాల నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా డౌట్స్ వస్తున్నాయి. వీటిపై యశ్‌రాజ్ టీమ్ ఇటీవల క్లారిటీ ఇచ్చింది.
ఆగస్టు 14న ‘వార్ 2’ సినిమా థియేటర్లలో రావాల్సి ఉన్నప్పటికీ.. తారక్ ఇతర ప్రాజెక్టులు, హృతిక్ రోషన్‌కి గాయం లాంటి కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమవుతుండటంతో విడుదల వాయిదా పడే అవకాశముందని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ చేసిన ఎక్స్ పోస్టు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే దీనంతటికి కారణం ఓ నెటిజన్ చేసి పోస్టే కారణం.
‘స్పై యూనివర్స్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో జరిగిన ఛాట్ ఇదీ అంటూ.. ఓ యానిమేటడ్ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్‌కి చెందిన స్పై యూనివర్స్ సినిమాల్లో నటించిన వాళ్లంతా ఛాటింగ్ చేస్తున్నట్లు.. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నట్లు చూపించారు. అయితే ఆఖర్లో ఎన్టీఆర్ ఆ గ్రూపులోకి ఎంట్రీ ఇచ్చినట్లు చూపించారు. దీనికే యశ్‌రాజ్ సోషల్ మీడియా టీమ్ రిప్లై ఇచ్చింది.
‘వార్ 2’ సినిమా మార్కెటింగ్ ప్రారంభించక ముందే మీరు అద్భుతంగా ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో వార్ 2 అల్లకల్లోలం జరుగుతుంది అని రాసుకొచ్చింది. అంటే రిలీజ్ డేట్ విషయంలో మార్పులు లేవనే అర్థం. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ముగింపు దశ చిత్రీకరణలో ఉంది.