KGF2 Censor Report: ‘కేజీఎఫ్ 2’ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి రన్ టైమ్ ఎంతంటే..?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘కేజీఎఫ్2’. కన్నడ స్టార్ హీరో యష్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 21, 2018లో విడుదలైన ‘కేజీఎఫ్ చాఫ్టర్ 1’కు కొనసాగింపుగా ఈ సినిమాను రూపొందించారు. పార్ట్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.

Click Here To Watch NOW

అందుకే ఇప్పుడు పార్ట్ 2పై అందరి దృష్టి పడింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా మేకర్స్ కూడా ‘కేజీఎఫ్2’ సినిమాను భారీగా నిర్మించారు. సంజయ్ దత్, ర‌వీనాటాండ‌న్‌, రావు రమేష్, ప్రకాష్ రాజ్ వంటి పేరున్న నటీనటులు ఈ సినిమాలో కనిపించనున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది కానీ కోవిడ్ కారణంగా ఏప్రిల్ 14కి వాయిదా వేశారు.

రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డులు కొల్లగొట్టింది. ఇండియన్ సినిమాల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ గా పేరు తెచ్చుకుంది. లేటెస్ట్ గా ‘కేజీఎఫ్ 2’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికెట్ ను పొందింది. సినిమా నిడివి 2 గంటల 48 నిమిషాలుగా ఖరారైంది. దాదాపు మూడు గంటలుగా దగ్గరగా సినిమా ఉంటుందన్నమాట.

సినిమా ఎలా ఉండబోతుందోనని అందరిలో తెలియని ఎగ్జైట్మెంట్ నెలకొంది. ఈసారి యష్ తన పెర్ఫార్మన్స్ తో ఎన్ని వందల కోట్లను కలెక్ట్ చేస్తాడో చూడాలి. ఈ సినిమాను క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో విడుదల చేస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ర‌వి బస్రూస్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి భువ‌న్ గౌడ సినిమాటోగ్రాఫ‌ర్‌.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus