Mahi V Raghav: ఇకపై బయోపిక్ సినిమాలు చేయను… యాత్ర డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు డైరెక్టర్ మహి వి రాఘవ్. ఈ సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆయన ముఖ్యమంత్రిగా కావడం అనంతరం రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ రాజశేఖర్ రెడ్డి మరణించిన సంఘటనల గురించి తెలియజేశారు. అయితే ఈ సినిమాని గత ఎన్నికల ముందు విడుదల చేయడంతో సంచలనగా మారింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని కూడా ఈయన ప్రకటించారు.

యాత్ర 2ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ఈ సినిమాని కూడా వచ్చే ఎన్నికల ముందు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా వైఎస్సార్ జయంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు రిపోర్టర్స్ డైరెక్టర్ (Mahi V Raghav) మహీవి రాఘవ్ ను ప్రశ్నిస్తూ పలు విషయాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తూ యాత్ర 2తరువాత మరే ఇతర సెలబ్రిటీల బయోపిక్ అయిన తీసే ఆలోచనలో ఉన్నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వంటి వారి బయోపిక్ సినిమాలను చేసే ఆలోచనలో ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు డైరెక్టర్ సమాధానం చెబుతూ… తాను ఇకపై ఎవరి బయోపిక్ సినిమాలు చేయాలనే ఆలోచనలో లేనని తెలిపారు. యాత్ర 2 మాత్రమే తన లాస్ట్ పొలిటికల్ బయోపిక్ చిత్రమని ఈయన తెలిపారు.

ఇక ఎవరి దగ్గరైనా 500 కోట్లు ఉన్నాయి అంటే వారు తన వద్దకు వచ్చి తమ బయోపిక్ సినిమా చేయమని కోరుతున్నారు.అందుకే తాను ఇకపై ఎలాంటి బయోపిక్ సినిమాలు చేయనని ఇదేనా లాస్ట్ బయోపిక్ సినిమా అంటూ సమాధానం చెప్పారు. ఈ విధంగా మహి సమాధానం చెప్పడంతో ఈయనను బహుశా ఎవరెవరు బయోపిక్ సినిమాలు చేయమని అడిగి ఉంటారన్న ఆలోచనలో పడ్డారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus