తెలుగు భాష ఖ్యాతి ఖండాంతరాలు వ్యాపించి సంవత్సరం అయ్యింది.!

అది 2017 ఏప్రిల్ 28. అప్పటిక్వరకూ తెలుగు సినిమా విడుదలవుతుంది అది కూడా ఒక స్టార్ హీరో సినిమా అంటే.. మహా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకాస్త ఎక్కువ అనుకుంటే ఓవర్సీస్ లో తెలుగోళ్ళు వెయిట్ వెయిట్ చేస్తుంటారు. కానీ.. మొట్టమొదటిసారిగా భాషాబేధం, ప్రాంతీయబేధం అనేది లేకుండా అన్నీ దేశాల ప్రజలూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఏకైక చిత్రం “బాహుబలి 2“. అప్పటికే “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?” అనే ప్రశ్న అందర్నీ తొలిచేస్తుంది. ఎలాగైనా ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కోసం దాదాపు పదేళ్ల తర్వాత జనాలు థియేటర్ల ముందు క్యూ కట్టారు. తెలుగు సినిమాకి మళ్ళీ పూర్వవైభవం వచ్చిందని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, థియేటర్ల ఒనర్లు సంబరపడిపోయారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన “బాహుబలి 2” ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు జపాన్, చైనా భాషల్లోనూ విడుదలై అక్కడ కూడా భారీ విజయం సాధిస్తూ అఖండ విజయకేతనాన్ని ఎగురవేసింది.

ఈ సినిమా కేవలం ఒక సూపర్ సక్సెస్ ఫుల్ తెలుగు ఫిల్మ్ మాత్రమే కాదు. తెలుగు వాడి సత్తాను ఘనంగా చాటిన ఏకైక చిత్రం “బాహుబలి 2”. అందుకే సినిమా విడుదలై ఏడాది కావస్తున్నా.. ఆల్రెడీ సినిమాని యూట్యూబ్ లో పెట్టేసినా కూడా సినిమాకి ఇప్పటికీ విపరీతమైన క్రేజ్. అనుష్క అందం, అభినయం, రమ్యకృష్ణ రౌద్రం, రాణా విలనిజం, సత్యరాజ్ స్నేహభావం, ప్రభాస్ రాజరికం మరియు వీటన్నిటినీ కలగలిపి “బాహుబలి 2” లాంటి ఒక కళాకండాన్ని తెరకెక్కించిన రాజమౌళి ప్రతిభ “బాహుబలి 2” విజయానికి ముఖ్యకారణం. ఏడాది కాదు మరో దశాబ్ధం ముగిసినా “బాహుబలి 2” ఎగురవేసిన విజయకేతనం ప్రపంచవ్యాప్తంగా విజయగర్వంతో ఎగురుతూనే ఉంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus