‘చరిత సినిమా ఆర్ట్స్’ బ్యానర్ పై జి.వి.ఎన్ శేఖర్ రెడ్డి నిర్మించిన తాజా చిత్రం ‘ఏడు చేపల కథ’. ఎస్.జె.చైతన్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అభిషేక్, భాను శ్రీ హీరో హీరోయిన్లు గా నటించారు. పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 7న(నిన్న) విడుదలయ్యింది. టీజర్, ట్రైలర్ లు చూసి ఓ రేంజ్లో టెంప్ట్ అయిన ప్రేక్షకులు ఈ సినిమాకి ఎగబడి వెళ్ళారు. అయితే టెంప్ట్ అయ్యి వెళ్ళిన ప్రేక్షకులకు… కనీసం సినిమాగా కూడా అలరించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మొదటి రోజు ఈ చిత్రానికి కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయనే చెప్పాలి.
నైజాం | 0.38 cr |
సీడెడ్ | 0.20 cr |
ఉత్తరాంధ్ర | 0.13 cr |
ఈస్ట్ | 0.08 cr |
వెస్ట్ | 0.07 cr |
కృష్ణా | 0.07 cr |
గుంటూరు | 0.05 cr |
నెల్లూరు | 0.05 cr |
ఏపీ + తెలంగాణ | 1.05 cr |
ఈ చిత్రానికి 1.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి రోజే ఈ చిత్రానికి 1.05 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో 45 లక్షలు వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే…! అయితే సినిమాకి డిజాస్టర్ టాక్ రావడంతో నిన్న ఈవెనింగ్ షోలు బుకింగ్స్ డల్ అయిపోయాయి. అయితే మాస్ సెంటర్స్ లో మాత్రం ఈ చిత్రానికి బుకింగ్స్ బాగున్నాయి. అయితే రెండో రోజు ఈ చిత్రానికి ఎంత వరకూ కలెక్షన్స్ వస్తాయి అనేదాని బట్టి ఈ వీకెండ్ కు బ్రేక్ ఈవెన్ అయ్యేది లేనిది ఓ అంచనా వెయ్యొచ్చు అంటున్నారు ట్రేడ్ పండితులు.
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!