శనివారం ఎపిసోడ్ లో రేవంత్ కి ఇచ్చిన కార్డ్ ఎలాంటిందో తెలుసా..? దీనివల్ల ఏమవుతుందంటే.?

బిగ్ బాస్ రియాలిటీ షోలో రేవంత్ కి హౌస్ట్ నాగార్జున ఎల్లో కార్డ్ ఇచ్చాడు. నిజానికి ఈకార్డ్ గురించి చాలామందికి తెలీదు. అసలు ఈకార్డ్ వల్ల ఏంజరుగుతుందనేది ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హీందీ సీజన్స్ చూసేవాళ్లకి దీనిపైన అవగాహన ఉంది. హిందీ బిగ్ బాస్ లో ఇప్పటికీ ఈ కార్డ్ చాలామందికి వచ్చింది. ఈ కార్డ్ దేనికి ఇస్తారాంటే., బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడైనా ఎవరైనా ఫిజికల్ గా ఎగ్రెసివ్ గా వెళ్లి వేరే హౌస్ మేట్ ని డీప్ గా హర్ట్ చేసినా, లేదా కొట్టినా ఈ ఎల్లోకార్డ్ ఇస్తారు. ఇలా ఇచ్చినపుడు ఒక్కోసారి వీళ్లు నేరుగా నామినేట్ అయిపోతారు.

హౌస్ మేట్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా బిగ్ బాస్ హౌస్ లో ఆవారం నామినేషన్స్ లోకి వచ్చేస్తారు. కానీ, నాగార్జున ఈకార్డ్ ఇచ్చినపుడు ఇదేమీ చెప్పలేదు. కాబట్టి, ప్రస్తుతం రేవంత్ కి వచ్చి డేంజర్ ఏమీ లేదు. కానీ, ఎల్లో కార్డ్ వల్ల ఒక ప్రమాదం ఉంది. ఈ ఎల్లో కార్డ్ వచ్చిన వాళ్లు ఏదైనా టాస్క్ ఆడినపుడు దురుసుగా ప్రవర్తించినా, లేదా వేరే హౌస్మేట్ ఏదైనా అబ్జక్ట్ చేసినా వెంటనే టాస్క్ నుంచీ ఎలిమినేట్ అయిపోతారు. బిగ్ బాస్ ఇప్పటికే మీకు ఎల్లో కార్డ్ ఉంది కాబట్టి ఆటలో నుంచీ అవుట్ అయ్యారని ప్రకటిస్తాడు.

అంతేకాదు, ఈ కార్డ్ తర్వాత వచ్చే రెడ్ కార్డ్ ద్వారా ఒక్కోసారి ఎలిమినేట్ కూడా అయిపోతారు. రేవంత్ కి వచ్చిన ఈ ఎల్లో కార్డ్ ఎంత డేంజరో తనకి తెలీదు. నిజానికి ఇది చాలా లైటర్ వే లో చెప్పి ఇచ్చాడు కింగ్ నాగార్జున. కొద్దిగా సీరియస్ గా ఈ కార్డ్ గురించి ఎక్స్ ప్లయిన్ చేస్తూ ఇచ్చి ఉంటే ఇంకా మజా వచ్చేది. నిజానికి రేవంత్ ఎల్లో కార్డ్ ఇచ్చేంత ఎగ్రెసివ్ గానే గేమ్ ఆడాడు. హౌస్ లో ఎదైనా టాస్క్ లో ఫిజికల్ గా ఒకరి మీదకి వెళ్లినా, లేదా అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడినా, ఏదైనా బూతులు తిట్టినా ఈ కార్డ్ ద్వారా ఎలిమినేట్ చేసే అవకాశం బిగ్ బాస్ కి ఉంది.

తెలుగు సీజన్ లో ఇలా ఒక పార్టిసిపెంట్ కి ఎల్లో కార్డ్ రావడం అనేది మొదటిసారి. అందులోనూ టాప్ రేటింగ్ తో, ఓటింగ్ తో దూసుకువెళ్తున్న రేవంత్ కి ఇలా ఒక కార్డ్ రావడం అనేది కొద్దిగా ఫ్యాన్స్ ని కలవర పరుస్తోంది. ఏది ఏమైనా ఈవారం కొద్దిగా రేవంత్ జాగ్రత్తగా గేమ్ ఆడటం ఉత్తమం అని బిగ్ బాస్ ఫ్యాన్స్ కాెమెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus