కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకోవాలనుకొన్నారు!

  • January 17, 2018 / 11:44 AM IST

ఇప్పుడంటే డ్రమ్ములా తయారైయ్యింది కానీ.. “సొంతం, జెమిని” టైమ్ లో నమితను చూసి సొంగ కార్చని కుర్రోడు లేడంటే అతిశయోక్తి కాదేమో. కానీ.. తర్వాతి కాలంలో డైట్ కంట్రోల్ లేకపోవడంతో ఇంతింతై వటుడింతై అన్న రేంజ్ లో భారీగా పెరిగిపోయింది. మళ్ళీ కాస్త సన్నబడి తాను చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న ఓ నవ యువ కథానాయకుడ్ని తిరుపతిలో పెళ్లాడి సెటిల్ అయ్యిందనుకోండి. కాకపోతే.. తిరుపతిలో జరిగిన ఒరిజినల్ పెళ్లి కంటే కొన్నాళ్ళ ముందు నమితకు ఓ డూప్లికేట్ మ్యారేజ్ ఆల్మోస్ట్ పీటల దాకా వచ్చి ఆగిపోయిందట. అదేదో షూటింగ్ కోసం అయ్యుంటుందిలే అని ఊహిస్తే మీరు పొరబడినట్లే.

ఒకసారి నమిత ఒక ఈవెంట్ కోసం సిటీకి కాస్త అవతల ఉన్న ఓ ఊరికి వెళ్లిందట. హీరోయిన్ కాబట్టి ఆమెను పికప్ చేసుకోవడానికి మంచి కారు రావడంతో సైలెంట్ గా ఎక్కేసింది. కారు ఎక్కిన అరగంట తర్వాత నుంచి ఈవెంట్ మ్యానేజర్స్ ఒకటేపనిగా కాల్స్ చేయడం మొదలెట్టారట. మొదట ఎలాగూ అక్కడికే కదా వెళ్ళేది అని లైట్ తీసుకొన్న నమిత కాల్స్ ఎంతకీ ఆగకపోవడంతో లిఫ్ట్ చేసిందట. “మేడమ్ కారు మీకోసం వెయిట్ చేస్తుంది, మీరు ఎక్కడున్నారు?” అనే క్వశ్చన్ వినిపించేసరికి షాక్ అయ్యిందట.

కట్ చేస్తే.. నమిత అంటే విపరీతమైన అభిమానం గల ఓ డ్రైవర్ ఎయిర్ పోర్ట్ లో ఆమెను చూసి సైలెంట్ గా కారు ఎక్కించుకొని ఇంకొందరు డ్రైవర్ల సహకారంతో వాళ్ళ సిటీకి తీసుకుని వెళ్ళిపోయి.. అక్కడ పెళ్లి చేసుకొందామనుకొన్నాడట. ఆఖరి నిమిషంలో ఊరి పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి నమితను ఆ పెనుముప్పు నుంచి తప్పించారట. లేదంటే.. నమితకు ఆల్రెడీ ఒక పెళ్లి కూడా అయిపోయేది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus