Indian 2 Movie: యోగ్ రాజ్ సింగ్ గురించి ఆసక్తికర విషయాలు..!

విశ్వనటుడు కమల్ హాసన్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్’ (భారతీయుడు) కి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రాబోతోంది.. భారీ బడ్జెట్‌తో అనౌన్స్ చేసిన ‘ఇండియన్ 2’ కి స్టార్టింగ్ నుండి అన్నీ సినిమా కష్టాలే.. పాండమిక్‌తో పాటు పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది.. ఇటీవలే మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ కీలకపాత్రల్లో నటిస్తున్న ‘ఇండియన్ 2’ కి సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది..

ఓ స్టార్ క్రికెటర్ తండ్రి ఈ మూవీలో విలన్‌గా కనిపించనున్నారు. ఆయన ఎవరో కాదు.. యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్.. కమల్, శంకర్‌ల సినిమాలో నటిస్తున్న విషయాన్ని కన్ఫామ్ చేస్తూ మేకప్ వేసుకుంటున్న పిక్ షేర్ చేశారాయన.. యోగ్ రాజ్ సింగ్ పలు పంజాబీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. కానీ ఈ రేంజ్ పాన్ ఇండియా, అందులోనూ ఇండియన్ ఫిల్మ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్..

అయితే యోగ్ రాజ్ సింగ్ యాక్టర్ అనే విషయం నెటిజన్లకి పెద్దగా తెలియదు కానీ 2011 వరల్డ్ కప్ తర్వాత తన కొడుకు యువరాజ్ సింగ్ కెరీర్ డౌన్ ఫాల్ అవడానికి ధోని కారణమంటూ కామెంట్స్ చేసి వార్తల్లో కనిపించారు. ఇండియన్ సినిమాలో నటిస్తున్నానంటూ తనను తాను పంజాబ్ సింహంగా అభివర్ణించుకున్న యోగ్ రాజ్, కమల్ హాసన్ లెజెండ్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు సినీ స్టార్ట్స్ (హీరోయిన్స్) క్రికెటర్స్‌తో లవ్‌లో పడడం చూశాం కానీ కొద్దికాలంగా క్రికెటర్స్ బ్యాట్ వదిలేసి మేకప్ వేసుకోవడం మొదలెట్టారు..

2017లో యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయిన శ్రీశాంత్ హిందీ, తమిళ్, కన్నడ, మలయాళలంలో సినిమాలు చేశాడు. హర్భజన్ సింగ్ మూడు సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ చేసి, ‘ఫ్రెండ్‌షిప్’ లో లీడ్ రోల్‌లో కనిపించాడు. ఇర్ఫాన్ పఠాన్, చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ మూవీలో విలన్‌గా నటించాడు.. ధోని ఇటీవలే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు. భార్య సాక్షితో కలిసి సినీ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus