Sara Tendulkar: ఆ హీరో సినిమా కోసం వెయిటింగ్ : సారా టెండూల్కర్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా సారా టెండూల్కర్ కి సంబంధించి ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇకపోతే తాజాగా సారా టెండూల్కర్ ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయం గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. తాజాగా సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ చూస్తే కనుక ఈమెకు ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయం అర్థం అవుతుంది.

సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తాను సలార్ సినిమా ట్రైలర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కాబోతుంది మరొక పది రోజులలో ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే సారా టెండూల్కర్ కూడా ఈ సినిమా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నాను అంటూ పోస్ట్ చేయడంతో ఈమె కూడా ప్రభాస్ కి వీరాభిమాని అని స్పష్టంగా అర్థం అవుతుంది.

ఈ పోస్ట్ పై పెద్ద ఎత్తున అభిమానులు లైక్ చేస్తూ వచ్చారు. (Sara Tendulkar) సారా టెండూల్కర్ వంటి వారే తనకు ప్రభాస్ అంటే ఇష్టమని తెలియజేయడంతో ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. బాహుబలి తర్వాత ఈయన మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ మూడు సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన కమర్షియల్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే సలార్ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. డిసెంబర్ 22వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus