Prithviraj: సలార్ సినిమాలో నటించిన ఈ కుర్రాడు ఆ టాలీవుడ్ హీరో కొడకునా?

ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అన్ని ప్రాంతాలలోనూ ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ప్రభాస్ కి ఈ సినిమా ద్వారా సరైన హిట్ పడిందని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఇందులో ఉన్నటువంటి కొత్త నటీనటుల గురించి కూడా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా పృథ్విరాజ్ సుకుమార్ చిన్నప్పటి పాత్రలో నటించినటువంటి చిన్నారి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పాత్రలో ఎంతో ఒదిగిపోయిన నటించినటువంటి ఈ కుర్రాడు ఎవరు ఏంటి అనే విషయాన్ని వస్తే.. పృధ్విరాజ్ చిన్నప్పటి పాత్రలో నటించినటువంటి ఈ కుర్రాడు మరెవరో కాదు స్వయంగా రవితేజకు కొడుకు అవుతారు. రవితేజ కొడుకు అంటే ఆయన సొంత కొడుకు కాదు ఆయన కజిన్ కుమారుడు పేరు కార్తికేయ దేవ్. ప్రస్తుతం ఈ కుర్రాడు పదో తరగతి చదువుతున్నారు.

ఈ పాత్ర కోసం ఎంతోమందిని ఆడిషన్స్ చేసినప్పటికీ ఎవరు ఎంపిక కాలేదు. ఇక కార్తికేయ దేవ్ ఆడిషన్స్ లో ఎంపిక కావడంతో దాదాపు నెలరోజుల పాటు రిహార్సల్స్ చేశారని ఇలా నెలరోజులపాటు రిహార్సల్స్ చేసిన తర్వాత 15 రోజులపాటు ఈయన పాత్రకు సంబంధించినటువంటి షూటింగ్ మొత్తం పూర్తి చేశారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కార్తికేయ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో పృథ్వి పాత్రలో నటించినటువంటి ఈ కుర్రాడు తన నటనతో మంచి ఆదరణ సంపాదించుకున్నారని చెప్పాలి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus