ఈ ప్లానింగ్‌ అందరూ చేస్తేనా… టాలీవుడ్‌ మరో లెవల్‌లో…

అగ్ర స్టార్‌ హీరో సినిమా ఛాన్స్‌ దొరికితేనో లేకపోతే కుర్ర స్టార్‌ హీరో అవకాశం దొరికితే కొత్త దర్శకులు చాలా ఆనందపడతారు. తొలి సినిమాతో మంచి విజయం అందుకుని, రెండో ఛాన్స్‌గా స్టార్‌ అవకాశం దొరికితే ఇంకా హ్యాపీ. కొంతమంది ఈ ఆనందంలో ఏళ్లకు ఏళ్లు వెయిట్‌ చేస్తుంటారు. ఇంకొందరు పక్కాగా ప్లాన్‌ చేసుకుని ఆ పెద్ద సినిమా సెట్స్‌కు వెళ్లేలోపు ఇంకో సినిమా చేసేస్తుంటారు. ఏంటీ ఇలా కూడా ఉంటారా అనుకుంటున్నారా? అయితే టాలీవుడ్‌లో ఈ ఇద్దరు దర్శకుల గురించి వినలేదు అన్నమాట.

గౌతమ్‌ తిన్ననూరి, ప్రశాంత్‌ వర్మ… వీరిద్దరి గురించే పైన చెప్పింది. తమ సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న ఈ ఇద్దరు దర్శకులు మరో సినిమా తీయడానికి మధ్యలో వచ్చిన గ్యాప్‌ను పక్కాగా వాడుకున్నారు అని సమాచారం. రామ్‌చరణ్‌ – గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉండింది. అయితే ఎందుకో కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. దాంతో విజయ్‌ దేవరకొండతో సినిమాను ఓకే చేసుకున్నారు గౌతమ్‌ తిన్ననూరి. అయితే ఆ సినిమా ప్రారంభానికి కాస్త ఆలస్యమవుతోంది.

దీంతో ఖాళీగా ఉండటం ఎందుకు అనుకున్నారో ఏమో… ఈ లోపు గౌతమ్‌ మరో చిన్న సినిమా పూర్తి చేసేశారట. కొత్త కుర్రాళ్లతో గౌతమ్‌ ఓ సినిమా చేశారని, త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నారట. ‘మ్యాడ్‌’ తరహాలో కుర్రకారుకు నచ్చేలా ఆ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌, రిలీజ్‌ డేట్‌ వస్తాయి అని టాక్‌. ఇక ‘హను – మాన్‌’ సినిమాను చాలా కాలం క్రితమే పూర్తి చేసిన ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) కూడా ఇదే పని చేశారు అని అంటున్నారు.

‘హను – మాన్‌’ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులకు ఎక్కువ సమయం పట్టడంతో ఈ గ్యాప్‌లో ఓ చిన్న సినిమా చేశారు అని అంటున్నారు. త్వరలో ఈ విషయంలో కూడా క్లారిటీ వస్తుందట. అయితే అప్పుడెప్పుడో డీవీవీ దానయ్య తనయుడుతో మొదలుపెట్టిన ‘అధీర’ ఏమైంది అనేది తెలియడం లేదు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus