Jr NTR: ఆ సినిమా చేయాలనే తారక్ కోరిక తీరుతుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నవరసాలను అద్భుతంగా పలికించి విజయాలను సొంతం చేసుకుంటున్న స్టార్ హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే. 1983 సంవత్సరం మే నెల 20వ తేదీన జన్మించిన ఎన్టీఆర్ పది సంవత్సరాల వయస్సులో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో సినిమాల్లో కెరీర్ ను మొదలుపెట్టారు. నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టగా ఈ సినిమాకు 4 లక్షల రూపాయలు పారితోషికంగా అందుకున్నారు.

ఎన్టీఆర్ డ్యాన్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పలు సినిమాలలో ఎన్టీఆర్ పాటలు పాడగా ఆ పాటలకు మంచి పేరు వచ్చింది. ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి సినిమాలలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయగా ఈ సినిమాలలో అదుర్స్ మాత్రమే సక్సెస్ ను సొంతం చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేసిన జై లవకుశ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఎన్టీఆర్ అభినయానికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా మూవీ ఆడియో ఫంక్షన్ కోసం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ కు జపాన్ లో కూడా అభిమానులు ఉన్నారు. అక్కడ భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైన టాలీవుడ్ హీరో తారక్ కావడం గమనార్హం. తారక్ కు 9 నంబర్ సెంటిమెంట్ కాగా తారక్ తన కార్లకు ఇదే నంబర్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. తన సినిమాలలో తారక్ కు ప్రత్యేకమైన అభిమానం ఉన్న సినిమా అదుర్స్ కావడం గమనార్హం.

అదుర్స్ సినిమాకు సీక్వెల్ చేయాలని ఎన్టీఆర్ కోరిక కాగా ఆ కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాల్సి ఉంది. తారక్ వంట కూడా అద్భుతంగా చేస్తారు. ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాల నుంచి అప్ డేట్స్ వచ్చాయి. ఈ రెండు సినిమాలలో ఎన్టీఆర్ మాస్ రోల్స్ లో నటిస్తున్నారని అర్థమవుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus