Jr NTR: వేగం తగ్గినా పర్లేదు.. రికార్డులు బద్దలవ్వాల్సిందే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత కొంతకాలంగా షూటింగ్ లకు దూరంగా ఉండటంతో కెరీర్ విషయంలో తారక్ తప్పటడుగులు వేస్తున్నారని కొంతమంది నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తారక్ ప్రణాళిక మాత్రం మరోలా ఉందని తెలుస్తోంది. అటు కొరటాల శివ ఇటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ నటిస్తున్న సినిమాల స్క్రిప్ట్ లు నెక్స్ట్ లెవెల్ లోనే ఉన్నాయని సమాచారం అందుతోంది. వేగం తగ్గినా పరవాలేదని నటించే ప్రతి సినిమాతో రికార్డులు బద్దలవ్వాలని తారక్ ఫిక్స్ అయ్యారని సమాచారం.

తనతో సినిమాలు చేస్తున్న దర్శకులకు తారక్ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నారని అయితే అదే సమయంలో సినిమాకు ప్లస్ అయ్యే విధంగా ఉన్న సలహాలు, సూచనలను కూడా ఇస్తున్నారని బోగట్టా. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తారక్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇతర డైరెక్టర్లు కథ చెప్పినా సాధారణంగా ఉందని అనిపిస్తే తారక్ రిజెక్ట్ చేస్తున్నారు. బుచ్చిబాబు చెప్పిన కథ తారక్ కు నచ్చినా మరో రెండేళ్ల పాటు బుచ్చిబాబును వెయిట్ చేయించడం ఇష్టం లేక తారక్ బుచ్చిబాబు చరణ్ కాంబినేషన్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.

తారక్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ లేక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్న సంగతి తెలిసిందే. అయితే 2023 సంవత్సరంలో మాత్రం వరుస అప్ డేట్స్ తో తారక్ పేరు మారుమ్రోగనుందని సమాచారం. షూటింగ్ మరింత ఆలస్యమైనా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ వచ్చే ఏడాది జూన్ నుంచి మొదలుకానుందని సమాచారం.

షూట్ మొదలైన వెంటనే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ నుంచి టీజర్ కూడా రిలీజ్ కానుందని సమాచారం. వచ్చే ఏడాది తారక్ పుట్టినరోజు వరకు తారక్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus