Shanmukh Jaswanth: ఈ యూట్యూబర్ ఆదాయం మామూలుగా లేదుగా..?

  • April 29, 2021 / 03:35 PM IST

యూట్యూబ్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో షణ్ముఖ్ జశ్వంత్ ఒకరు. వైవా అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న షణ్ముఖ్ జశ్వంత్ కొన్నిరోజుల క్రితం యాక్సిడెంట్ ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ జరిగిన సమయంలో షణ్ముఖ్ జశ్వంత్ మద్యం సేవించి ఉండటంతో నెటిజన్లు అతనిని తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. అయితే వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్ వీడియోలకు యూట్యూబ్ లో మాత్రం భారీగా వ్యూస్ వస్తున్నాయి.

షణ్ముఖ్ నటించిన వెబ్ సిరీస్ లు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే ఈ యూట్యూబర్ ఆదాయం నెలకు 7 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఎపిసోడ్ చొప్పున ఈ యూట్యూబర్ పారితోషికం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు షణ్ముఖ్ జశ్వంత్ పెళ్లికి సంబంధించిన వార్తలు సైతం తెగ వైరల్ అవుతున్నాయి. షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనా పెయిర్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

అయితే షణ్ముఖ్ కు, దీప్తి సునైనాకు బ్రేకప్ జరిగిందని గతంలో కొన్ని వార్తలు వైరల్ అయినా తాజాగా ఒక షోలో దీప్తి, షణ్ముఖ్ తాము ఆఫ్ స్క్రీన్ కపుల్స్ అని చెప్పుకొచ్చారు. షణ్ముఖ్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న సూర్యస్వామి అనే నటుడు దీప్తి షణ్ముఖ్ పెళ్లి ప్రస్తావనకు సంబంధించిన ప్రశ్నలకు స్పందిస్తూ ఇంకో రెండు సంవత్సరాలలో వాళ్లు పెళ్లి చేసుకోవచ్చంటూ కామెంట్లు చేశారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus