ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇక లేరన్న వార్తను ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. నమ్మినా నమ్ముకున్నా బాలు సుదూరాన ఉన్న చివరి మజిలీ చేరుకున్నారు. కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన బాలు దాదాపు రెండు నెలలు మృత్యుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శనివారం చెన్నైలోని తామరైప్పాక్కం ఫార్మ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాల మధ్య కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. 16 భాషలలో 40వేలకు పైగా పాటలు పాడిన గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్ బాలు.
నటుడిగా పదుల సంఖ్యలో నటించారు . డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక మంది స్టార్స్ కి గాత్రం దానం చేశారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన బాలుగారికి దక్కాల్సిన గౌరవం దక్కలేదనేది నిజం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాలును భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. కానీ బాలు భారత అత్యున్నత పురస్కారం భారతరత్నకు అర్హుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యంను భారత రత్నతో గౌరవించాలని కోరారు. ప్రధాని మోడీకి జగన్ ఈ లేఖ పంపడం జరిగింది. మరి సీఎం జగన్ లేఖకు కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. బాలీవుడ్ సింగర్ లతా మంగేష్కర్ కి భారత ప్రభుత్వం భారత రత్న ప్రధానం చేసిన సంగతి తెలిసిందే. స్వర్గీయ ఎన్టీఆర్ కి కూడా భారతరత్న ఇవ్వాలని తెలుగువారు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు.
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!