వాళ్ల మాటలు నమ్మితే వాళ్లు రెచ్చిపోతారు.. మన సినిమా ఇబ్బందులుపడుతుంది!

Ad not loaded.

తెలుగు సినిమాను మించింది లేదు.. తెలుగు సినిమాకు తిరుగేలేదు.. తెలుగు సినిమాను కొట్టేవారు లేరు అంటూ మనం ఓవైపు ఆనందాన్ని ప్రపంచానికి చెబుతున్నాం. నిజానికి పరిస్థితి అలానే ఉందా? మనల్ని మించిన సినిమా దేశంలోనే లేదా? మన సినిమాకు థియేటర్ల దగ్గర తిరుగేలేదా? మన సినిమాలు కొట్టేవారు కనిపించరా? ఇవన్నీ ఏమో కానీ.. మన సినిమాను మనవాళ్లే చంపేస్తున్నారు. కొంతమంది పైరసీ రూపంలో ముప్పుగా మారితే, మరికొంతమంది ట్రోలింగ్‌ – బాయ్‌ కాట్‌ అంటూ చంపేస్తున్నారు.

YSRCP

ఈ మాట వినడానికి కఠువుగా ఉండొచ్చు.. కానీ ఇదే నిజం అని చెప్పడానికి బాధగా ఉన్నా చెప్పక తప్పదు. ఎందుకంటే ఇలా తొలి షో పడటం ఆలస్యం దానిని అన్ని విధాలుగా చంపేయడానికి నెటిజన్లు అనే సాఫ్ట్‌నేమ్‌తో క్రూరమైన జనాలు రెడీ అవుతున్నారు. మరోవైపు ఎవరో ఏదో కామెంట్‌ చేస్తే ఏకంగా సినిమానే బాయ్‌కాట్‌ చేసేయండి అని పిలుపునిచ్చేస్తున్నారు. ఆ వ్యక్తి అన్న దాంతో ఆ సినిమాకు ఏంటి సంబంధం అనేది లేకుండా బాయ్‌కాట్‌ బేరాలు ఆడుతున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఓ రాజకీయ పార్టీకి (YSRCP) సంబంధించిన వాళ్లు తెలుగు సినిమాల్ని చంపేస్తున్నారట. ఈ విషయం ఎవరో చెప్పడం వాళ్లే అంటున్నారు. మమ్మల్ని అన్నారు కాబట్టి, మా పార్టీ వాళ్లు కారు కాబట్టి ఆ సినిమాల్ని డిజాస్టర్‌ చేసేశాం, మా మనిషి కాబట్టి మరో సినిమాను బ్లాక్‌ బస్టర్‌ చేశాం అంటూ చంకలు గుద్దుకుంటున్నారు. నిజానికి ఇది సాధ్యమా? అస్సలు కాదు. ఎందుకంటే పార్టీల వ్యక్తులు కాకుండా న్యూట్రల్‌ వ్యక్తులే ఎక్కువ ఉంటారు.

పార్టీల మనుషుల ముసుగులో కొంతమంది చేసే ప్రచారాన్ని వారు నమ్మరు. సినిమా బాగుంటే / బాగుందంటే చూస్తారు, లేదేంటే లేదు. అయితే ఈ విషయం తెలియని మరికొంతమంది వాళ్లు చెప్పిన విషయం నిజమో అనుకుని ఆయా సినిమాలకు వెళ్లడం లేదు. ఆ పార్టీ వ్యక్తులు చెప్పిన దాని ప్రకారం అయితే రీసెంట్‌గా వాళ్లు ‘మట్కా’ (Matka), ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer), ‘లైలా’ (Laila) సినిమాల ఫలితాల్ని శాసించారట. ‘పుష్ప: ది రూల్‌’ను (Pushpa 2: The Rule) హిట్‌ చేశారట. ఇది ఎట్టిపరిస్థితుల్లో సాధ్యం కాదు. కానీ పొలిటికల్‌ మోటోతో వాళ్లు అలా అంటున్నారు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus