సాయి కబీర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘డివైన్ లవర్స్’ చిత్రంలో కంగనా రనౌత్ నటించాల్సి ఉండగా.. ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకుంటున్నట్లు ఇటీవలే తెలిపింది. తాజాగా ఈ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ సరసన కంగనా స్థానం లో సల్మాన్ ప్రేయసీమణుల్లో ఒకర్తైన జరైన్ ఖాన్ ను ఎంపిక చేసినట్లు కబీర్ తెలిపాడు.
‘ఈ చిత్రంలో పాత్ర కోసం జరైన్ ఖచ్చితంగా సరిపోతుంది. అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రం సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళుతుంద’ ని కబీర్ పేర్కొన్నారు. కాగా చివరి సారి జరీనా ‘హేట్ స్టోరీ 3’ చిత్రంలో నటించింది. మరోవైపు ఈ చిత్రం కోసం జరీనా రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోనుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం కంగనా లండన్ లో హాలిడేను ఎంజాయ్ చేస్తోంది.