రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 25 వ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లను రాబట్టింది. ఇలా థియేటర్ లో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా మే 20వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో ప్రసారం కానుంది.
ఈ క్రమంలోనే జీ 5 పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇకపోతే ఇన్ని రోజుల వరకు ఈ సినిమాని ఓటీటీలో చూడాలంటే ఫే పర్ వ్యూ విధానాన్ని అమలు చేశారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున అభిమానుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తడంతో జీ5 సాధారణ ప్రేక్షకుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఈ సినిమాపై పే పర్ వ్యూ విధానం తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు జీ 5 సబ్స్క్రైబర్లు,పెయిడ్ యూజర్‌లకు ‘RRR’ని ఉచితంగా అందించనుంది.
జీ 5 ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడంతో సబ్స్క్రైబర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా మే 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ క్రమంలోనే తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమాని మే 20వ తేదీ విడుదల చేయనున్నారు.ఇక ఇంగ్లీష్ సబ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇకపోతే మే 20వ తేదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా తను నటించిన RRR సినిమాని జీ5 మే 20వ తేదీనే విడుదల చేయనుంది. థియేటర్లలో ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు రెండు నెలలు కావస్తోంది.ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించగా,రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!