Faima: అబ్బో.. ఫైమా ఎలిమినేషన్ కు అంత హడావిడి చేశారా?

పటాస్ ఫేమ్ ఫైమా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ లో కూడా ఈమె కొన్ని ఎపిసోడ్లలో మెరిసింది. ఇక ఈ ఏడాది ఎవ్వరూ ఊహించని విధంగా బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈమె కామెడీ టైం గురించి అందరికీ తెలిసిందే. ఏదో ఒక పంచ్ వేసి.. కడుపుబ్బా నవ్విస్తుంది ఫైమా. బిగ్ బాస్ సీజన్ 6 ఆరంభంలో కూడా ఈమె పై పాజిటివ్ కార్నర్ ఏర్పడడానికి కారణం అదే. ఆమె కన్నింగ్ నేచర్ బయటపెట్టింది అంటూ.

తోటి హౌస్మేట్స్ ఆమె పై మండిపడేవారు. ఫైమా కూడా ఇక్కడే తప్పు చేసింది. ఆమె సున్నితంగా వాళ్ళ విమర్శల పై స్పందిస్తే సరిపోయేది. కానీ వెటకారంగా సమాధానం ఇస్తూనే వెంటనే సీరియస్ అయిపోయేది. అందుకే ఈమె టాప్ 5 లో లేకుండా 13 వారాలకే బయటకు వచ్చేసింది అని అంతా అనుకుంటున్నారు. ఫైమా అయితే ‘ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న గీతు ఎలిమినేట్ అయినప్పుడే తన అంచనాలు అన్నీ తప్పాయని

అప్పుడే తాను టాప్ 5 లో ఉండే అవకాశం లేదు అని డిసైడ్ అయినట్టు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా…ఫెమా ఎలిమినేట్ అయ్యాక .. హౌస్ నుండీ బయటకు రావడానికి రూ.1.5 లక్షలు పైనే ఖర్చు చేసినట్టు సమాచారం. అదెలా అంటే.. ఫైమా హౌస్ నుండీ బయటకు వచ్చిన వెంటనే.. అన్నపూర్ణ స్టూడియోస్ నుండీ ఆమిర్ పేట్ ఏరియా వరకు ఊరేగింపుకి వెళ్లిందట. ఆమె చుట్టూ అభిమానులు బాణసంచా కాలుస్తూ రచ్చ రచ్చ చేశారని తెలుస్తోంది.

ఇలా చేస్తే.. అదొక రేంజ్ అన్న మాట. ఫైమా హౌస్ నుండీ బయటకి వచ్చాక … తనకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని జనాలు అనుకోవాలి, అలాగే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి.. అప్పుడు బుల్లితెర పై లేదా వెండితెర పై అవకాశాలు రావాలి. అది ఫైమా అండ్ టీమ్ తాపత్రయం. అయితే బిగ్ బాస్ లో ఆమె గెలిచింది రూ.3.25 లక్షలే అని టాక్ వినిపించింది. అందులో లక్షన్నర దీనికే ఖర్చు చేస్తే.. ఇక ఆమెకు మిగిలేది ఏముంటుందో అని కొంత మంది చర్చించుకుంటున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus