Sainikudu: 18 ఏళ్ళ ‘సైనికుడు’ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

2006 మహేష్ బాబుకి  (Mahesh Babu)  మర్చిపోలేని సంవత్సరం అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఏడాది మహేష్ బాబు హీరోగా 2 సినిమాలు వచ్చాయి. ఒకటి ‘పోకిరి’ (Pokiri)  .. ఇంకోటి ‘సైనికుడు’ (Sainikudu) . మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో ‘పోకిరి’ సినిమా వచ్చింది. చాలా లో-బజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. కేవలం టాలీవుడ్లోనే కాదు సౌత్ మొత్తంలో ఆ టైంకి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ‘పోకిరి’ చిత్రం. దీంతో మహేష్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.

Sainikudu

మహేష్ బాబు కెరీర్ గురించి చెప్పాలంటే ‘పోకిరి’ కి ముందు.. ‘పోకిరి’ తర్వాత అని చెప్పాలి. ఈ సినిమాతో మహేష్ బాబు మార్కెట్ ట్రిపుల్ అయ్యింది. చాలా కమర్షియల్స్ లో నటించే అవకాశం మహేష్ కి లభించింది. ఇలాంటి టైంలో మహేష్ బాబు నుండి ‘సైనికుడు’ అనే సినిమా వస్తుంది..అంటే అంచనాలు మామూలుగా ఉంటాయా? అది కూడా ‘ఒక్కడు’ (Okkadu) వంటి బ్లాక్ బస్టర్, ‘అర్జున్’ (Arjun) వంటి డీసెంట్ హిట్ అందించిన కాంబినేషన్ అయితే కచ్చితంగా ‘సైనికుడు’ .. ‘పోకిరి’ లానే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంతా అనుకుంటారు.

కానీ 2006 నవంబర్ 30 న విడుదలైన ‘సైనికుడు’ సినిమా ఆ అంచనాలను మ్యాచ్ చేయలేకపోయింది. నేటితో ఈ సినిమా విడుదలై 18 పూర్తి కావస్తున్న నేపథ్యంలో ‘సైనికుడు’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి :

1) వాస్తవానికి ‘పోకిరి’ కంటే ముందుగానే ‘సైనికుడు’ సినిమా షూటింగ్ మొదలైంది. కానీ షూటింగ్ టైంలో చాలా సమస్యలు వచ్చి పడ్డాయి.

2) సినిమాలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నప్పుడు ఓ టెక్నీషియన్ మరణించాడు. దీంతో ‘సైనికుడు’ షూటింగ్ కి బ్రేక్ పడింది. అదే టైంలో పూరి జగన్నాథ్ బౌండ్ స్క్రిప్ట్ తో మహేష్ ని అప్రోచ్ అవ్వడం 108 రోజుల్లో ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయడం జరిగింది.

3) ‘రాజకుమారుడు’ తో (Rajakumarudu) మహేష్ బాబుని హీరోగా లాంచ్ చేసిన నిర్మాత సి.అశ్వినీదత్ (C. Aswani Dutt) గారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మహేష్ తో సినిమా చేయాలని ప్రయత్నించారు. కానీ ఎందుకో సెట్ అవ్వలేదు. ఫైనల్ గా ‘సైనికుడు’ నిర్మించే ఛాన్స్ ఆయనకు దక్కింది.

4) ‘పోకిరి’ కి ముందు ‘సైనికుడు’ షూటింగ్ మొదలై చాలా నెలలు అయ్యింది. అప్పుడు అనుకున్న బడ్జెట్ తక్కువ. మహేష్ కెరీర్లో అప్పటివరకు ‘అతడు’ నే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. కానీ షూటింగ్ డిలే అవ్వడం.. ఆ తర్వాత వచ్చిన ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో .. ‘సైనికుడు’ బడ్జెట్ లెక్కలు మారిపోయాయి.అసలే అశ్వినీదత్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. దానికి తోడు ‘పోకిరి’ రిజల్ట్ తో ‘సైనికుడు’ బడ్జెట్ పెంచేశారు.

5) ముందుగా వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని అనుకున్నారు. తర్వాత అతన్ని పక్కనపెట్టి… ఆ టైంకి తమిళంలో మంచి ఫామ్లో ఉన్న హారిస్ జయరాజ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. హారిస్ జయరాజ్ (Harris Jayaraj) కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ని ఈ సినిమా కోసం ఆఫర్ చేశారట. ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ టైంకి హారిస్ జయరాజ్ కి రూ.80 లక్షలు పారితోషికంగా ఇచ్చినట్టు టాక్.

6) హారిస్ జయరాజ్ సంగీతంలో రూపొందిన ‘సైనికుడు’ లోని పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ‘ఓరుగల్లుకే పిల్ల పిల్ల’ ‘మాయేరా మాయేరా’ ‘సొగసు చూడతరమా’ వంటి పాటలు అన్నీ ఇప్పటికీ మార్మోగుతూ ఉంటాయి.

7) గుణశేఖర్ ని (Gunasekhar) మహేష్ చాలా ఎక్కువగా నమ్మి చేసిన సినిమా ఇది. స్టూడెంట్స్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనే లైన్ తో సినిమా మొదలుపెట్టారు. క్లైమాక్స్ లో మహేష్ బాబు చెప్పే డైలాగులు కూడా బాగుంటాయి.

8) అయితే హీరోయిన్.. విలన్ ని లవ్ చేయడం అనే పాయింట్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. దానికి తోడు హీరో దగ్గర ఎక్కువ విలన్ కోసం రొమాంటిక్ గా మాట్లాడటం వంటి సీన్స్ మహేష్ అభిమానులకు కూడా నచ్చలేదు.

9) ‘సైనికుడు’.. నవంబర్ 30 న రిలీజ్ అయితే.. ఆ రోజు నైట్ వరకు ప్రింట్లు అందలేదు. దీంతో థియేటర్ల వద్ద మహేష్ అభిమానులు తీవ్రంగా నిరసనకు దిగారు. ఫైనల్ గా అర్ధరాత్రికి షోలు పడ్డాయి. ఆ టైంకి ఎవ్వరికీ సినిమా నచ్చలేదు. దీంతో డిజాస్టర్ టాక్ పాకేసింది. అయినా మొదటి వారం బాగానే ఫుల్స్ పడ్డాయి.

10) అయినప్పటికీ.. ‘సైనికుడు’ సినిమా 57 కేంద్రాల్లో అర్థశతదినోత్సవం, 3 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకుంది. ఇంకో విశేషం ఏంటంటే కమర్షియల్ గా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి పెద్దగా నష్టాలు మిగల్చలేదు.వాటి లెక్కల ప్రకారం అబౌవ్ యావరేజ్ సినిమానే. ఓవర్సీస్ బయ్యర్స్ కూడా సేఫ్ అయ్యారు. కానీ ‘పోకిరి’ ఇచ్చిన హైప్ ని ‘సైనికుడు’ మోయలేకపోయింది అనేది వాస్తవం.

11) సైనికుడు చిత్రానికి గాను ‘ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్’ కి రానా దగ్గుబాటి (Rana Daggubati) ( స్పిరిట్ మీడియా) నంది అవార్డుని అందుకున్నారు

‘పుష్ప 2’ మిస్ అవ్వకుండా చూడాలనడానికి గల 5 కారణాలు..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus