Oke Oka Jeevitham: ఈ 10 మైనస్సులు లేకుంటే ఇంకా బాగుండేది..!

ఒకప్పుడు స్టార్ హీరోల రొటీన్ రొట్ట కొట్టుడు సినిమాల నుండి రిలీఫ్ అవ్వడానికి శర్వానంద్ సినిమాలు బాగా హెల్ప్ చేసేవి. అతని ప్రామిసింగ్ పెర్ఫార్మన్స్ కూడా అతన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకునేలా చేసేవి. మంచి టేస్ట్ ఉన్న హీరో కూడా..! అయితే అతని గత 6 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.’పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఇలా ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు ప్లాప్ అయ్యేవి. అయితే ఈసారి ‘ఒకే ఒక జీవితం’ అంటూ ఈరోజు(సెప్టెంబర్ 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. ఇది అతనికి 30వ సినిమా.! నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ వంటి స్టార్ క్యాస్ట్ ఉంది.’డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌’ నిర్మాణ సంస్థ ఈ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కొన్ని మైనస్ లు లేకపోతే యునానిమస్ హిట్ టాక్ ను సొంతం చేసుకునేది. ఆ మైనస్సులు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) టైం ట్రావెల్ కథాంశంతో కూడుకున్న సినిమాలకు జనాదరణ ఎప్పుడూ ఉంటుందని ఇటీవల వచ్చిన ‘బింబిసార’ ప్రూవ్ చేసింది. కానీ అందులో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి.. అక్కడక్కడా తప్పులు ఉన్నా పాస్ మార్కులు వేయించుకుంది. కానీ ‘ఒకే ఒక జీవితం’ అనేది కొంతవరకు ఆఫ్ బీట్ మూవీని తలపిస్తుంది. టైం ట్రావెల్ కథాంశంతో కూడుకున్న సినిమాలు స్క్రీన్ ప్లే పరంగా,ఉత్కంఠతని రేకెత్తించే విధంగా ఉండాలి. కానీ ఇందులో అది మైనస్ అయ్యింది.

2) కామెడీ విషయంలో కూడా ఇంకా బాగా డిజైన్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ అందులో కూడా వెనకబడిందనే చెప్పాలి.

3) హీరో శర్వానంద్ ఈ చిత్రంలో చాలా డల్ గా కనిపించాడు. అతని పాత్ర కూడా అలా ఉంది. పైగా పక్కన వెన్నెల కిషోర్, ప్రియదర్శి వంటి పోటీ ఇచ్చే నటీనటులు ఉండడం వల్ల శర్వా మార్క్ యాక్టింగ్ ఇందులో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.

4) సైంటిస్ట్ గా కనిపించిన నాజర్, హీరోయిన్ గా చేసిన రీతూ వర్మ పాత్రల నిడివి ఇంకాస్త ఉంటే బాగుండేది. వారి పాత్రల నిడివి తగ్గించడం వల్ల ఇన్-కంప్లీట్ ఫీలింగ్ కలుగుతుంది.

5) సరైన సాంగ్స్ లేకపోవడం కూడా ఓ మైనస్ అని చెప్పాలి. జేక్స్ బిజోయ్ సంగీతానికి ఇంకా మన తెలుగు ప్రేక్షకులు అలవాటు పడలేదో ఏమో కానీ ‘చావు కబురు చల్లగా’ ‘పక్కా కమర్షియల్’ వంటి చిత్రాలు కూడా ఆడియో పరంగా వీక్ అయ్యాయి. ‘ఒకే ఒక జీవితం’ లో నేపథ్య సంగీతంతో కూడా ఇతను పెద్దగా ఆకట్టుకోలేదు.

6)ఫస్ట్ హాఫ్ చాలా వరకు స్లోగానే సాగడం కూడా ఓ మైనస్ పాయింట్ అని చెప్పాలి. అయితే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్, ఇంటర్వెల్ వద్ద వచ్చే ట్విస్ట్ వల్ల పాస్ మార్కులు వేయించుకుంటాయి.

7)అలాగే సెకండ్ హాఫ్ ఆరంభం కూడా స్లోగా సాగుతుంది. చివరి 20 నిమిషాలు వల్ల సినిమా సేఫ్ అయ్యింది అని చెప్పొచ్చు.

8) తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాశాడు అనే టాక్ వినిపించింది. కానీ అతని స్టైల్ లో అయితే ఈ సినిమాలో డైలాగ్స్ లేవు. నిజంగా అతనే రాసి ఉంటే కనుక అతని నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

9) సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. కానీ ఇక్కడ దర్శకుడు 1998 కి బదులు 1978 కి తీసుకెళ్లాడు అనే విమర్శలు వినిపించాయి.

10) నిర్మాణ విలువలు అక్కడక్కడా తేడా కొట్టాయి. రీ షూట్ల ఎఫెక్ట్ అనుకుంట..!

మొత్తంగా ఎంత హిట్ సినిమాకి అయినా మైనస్ లు లేకుండా అయితే ఉండవు కదా. ‘ఒకే ఒక జీవితం’ విషయంలో కూడా చిన్న చిన్న తప్పులు జరిగాయి. కానీ ఎమోషనల్ గా జనాలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి.. రెగ్యులర్ సినిమా లవర్స్ కు ఆ తప్పులు పెద్దగా ఇబ్బంది పెట్టవు. కానీ పై తప్పుల విషయంలో కనుక దర్శకుడు జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను రాబట్టుకునేది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus