కోలీవుడ్ స్టార్ హీరో, సూర్య తమ్ముడు అయిన కార్తి తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అతని సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అతను నటించిన ‘యుగానికి ఒక్కడు’ ‘ఆవారా’ ‘నా పేరు శివ’ ‘ఖాకి’ ‘ఖైదీ’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇంకా కొన్ని సినిమాలు యావరేజ్ గా ఆడాయి. అతను నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్దార్’ ఈరోజు అంటే అక్టోబర్ 21న దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో కార్తి డబుల్ రోల్ ప్లే చేశాడు. రాశీ ఖన్నా, రజిషా విజయన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని తెలుగులో ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై నాగార్జున రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి పర్వాలేదు అనిపించే టాక్ వస్తుంది కానీ కొన్ని మైనస్ లు లేకుండా ఉంటే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది అనేది కొందరి వాదన. ఆ మైనస్సులు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) ‘సర్దార్’.. కథ, పరంగా కంటెంట్ పరంగా బాగున్నప్పటికీ.. కథనం స్లోగా సాగడం ఓ మైనస్ అని చెప్పాలి. అందువల్ల ప్రేక్షకులు డీవియేట్ అవ్వడం జరిగింది.
2) ఫస్ట్ హాఫ్ ను చాలా ఎంగేజింగ్ గా నడిపాడు దర్శకుడు పి.ఎస్.మిత్రన్. అయితే సెకండ్ హాఫ్ విషయంలో అతను ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. సెకండాఫ్ లో సస్పెన్స్ ని మెయింటైన్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు.
3) సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ కనెక్టివిటీ కూడా మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అందువల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కొంత డిజప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు.
4)సంగీతం పరంగా చూసుకుంటే పాటలు జనాలకు ఎక్కవు. అందుకు డబ్బింగ్ సినిమా అనే కారణం చెప్పుకోకూడదు. ఎంత డబ్బింగ్ సినిమా అయినా మ్యూజిక్ సక్సెస్ అయిన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి.
5)లైలా ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది అనే పేరే కానీ, ఆమె పాత్రని సరైన విధంగా తీర్చిదిద్దలేదు అని చెప్పాలి.
6)రాశీ ఖన్నా పాత్రకి అంతంత మాత్రమే ప్రాముఖ్యత ఉండటం గమనార్హం.
7) డబ్బింగ్ సినిమా అయినా లిప్ సింక్ అనేది పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందో లేదో చూడాలి. ఈ సినిమాలో కొంతమంది నటీనటుల మాటలకు సరైన లిప్ సింక్ ఉండదు.
8) యాక్షన్ డోస్ కూడా అక్కడక్కడా ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది.
9) డబుల్ రోల్ అన్నప్పుడు కచ్చితంగా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. చాలా సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ అనేది హైలెట్ గా నిలుస్తుంటుంది. ఇందులో మాత్రం రివర్స్ అయ్యింది.
10) రన్ టైం కూడా 2 గంటల 46 నిమిషాలు ఉండడం ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే అంశం. కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయి. బహుశా అవి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయేమో కానీ.. తెలుగు ప్రేక్షకులకు అవసరం లేదనే చెప్పాలి. కాబట్టి.. వాటిని ట్రిమ్ చేస్తే ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.