ఇటీవల పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న సమంత నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. టీజర్, ట్రైలర్ వంటి వాటికి మంచి రెస్పాన్స్ లభించింది. సరోగసి నేపథ్యంలో సాగే కథ ఇది అని టీజర్, ట్రైలర్ లు క్లారిటీ ఇచ్చాయి. ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని హరి, హరీష్ డైరెక్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ నవంబర్ 11న అంటే ఈరోజు ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. కొంతమంది బాగుంది అంటున్నారు. మరికొంతమంది యావరేజ్ అంటున్నారు. ఇలాంటి టాక్ రావడానికి ‘యశోద’ లో కొన్ని మైనస్ లు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) ట్రైలర్ చూసి ఇది కేవలం ‘సరోగసి’ నేపథ్యంలో సాగే మూవీ మాత్రమే అనుకుని వచ్చిన జనాలు కొంత సర్ప్రైజ్ అయ్యారు.. అవుతారు. కానీ సెకండ్ చూసాక ఇది కంప్లీట్ గా వేరే జానర్ మూవీ అనే ఫీలింగ్ కలుగుతుంది. కథ పరంగా చూసుకుంటే ఇది కాస్త మైనస్ పాయింట్.
2)ఈ చిత్రంలో లీల పాత్ర పోషించిన దివ్య శ్రీపాద ఒక డైలాగ్ చెప్తుంది. ‘మాది తోలు బొమ్మలు ఆడించుకునే కుటుంబం’ అని..! అసలు తోలు బొమ్మలు ఆటలకు కాలం చెల్లిపోయి రోజులు అవుతుంది. ఐఫోన్ గురించి గర్భం ధరించాను అని ఒక అమ్మాయి చెప్పినప్పుడు ఈ అమ్మాయిలు ఏ కాలానికి చెందిన వాళ్ళు అనుకోవాలి.
3) ఫస్ట్ హాఫ్ మొదటి 40 నిమిషాలు కూడా చాలా స్లోగా సాగుతుంటుంది సినిమా..!
4) ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్ కూడా కొంచెం కథకి ఇబ్బంది పడిన ఫీలింగ్ కలిగిస్తుంది.
5) హాలీవుడ్ యాక్ట్రెస్ ఇండియాకు ఎంత పర్సనల్ వర్క్ పై ఇండియాకి వచ్చినా.. ఎటువంటి భద్రతా ఏర్పాట్లు లేని బిల్డింగ్ లో ఉండడం.. పైగా అక్కడ స్విమ్మింగ్ చేయడం అనేది లాజిక్ కు అందని సీన్. ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి.
6) సమంత సరోగసి అమ్మాయిలతో భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు.. జరిగే కామెడీ కూడా చాలా పేలవంగా ఉంటుంది. సినిమా మెయిన్ పాయింట్ కు వెళ్తున్న టైంలో ఇలాంటి సన్నివేశాలు మూడ్ ని డైవర్ట్ చేస్తాయి.
7) హీరోయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన అమ్మాయి అన్నప్పుడు.. వాళ్ళు ఆమెను తీసుకువెళ్తున్నప్పుడు పోలీసులు ఆ టైంలో ఫాలో చేయకుండా తర్వాత ఏవేవో క్లూస్ కోసం అవస్థలు పడటం అనేది ఎవ్వరికీ అర్థం కానీ ప్రశ్న.
8) ఇక సెకండ్ హాఫ్ అనేది ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది అని ఆనందించే లోపు.. యాక్షన్ సన్నివేశాలను అనవసరంగా సాగదీశారు అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ను చాలా సాగదీశారు అనిపించకమానదు.
9) ఎడిటింగ్ లోపాలు చాలానే ఉన్నాయి. కొన్ని అనవసరమైన సన్నివేశాలను ట్రిమ్ చేసుకునే సదుపాయం ఉన్నా.. ఎందుకో దర్శకులు అలా చేయలేదు.
10) సమంత ఉంది కదా అని ఇందులో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. ‘ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ ద్వారా పరిచయమైన కొత్త సమంత ఇందులో కనిపిస్తుంది.
ఈ మైనస్ లు కనుక లేకపోతే ‘యశోద’ కి కచ్చితంగా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది అనేది వాస్తవం. ఇప్పడైతే యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ సినిమాని చూసిన ఫీలింగ్ ను మాత్రమే కలిగిస్తుంది.