ఉగాది నుండి దసరా వరకు సినిమాలకు పెట్టిన పండుగ పేర్లు

దసరా…రిలీజ్ కి రెడీ అవుతున్న నాని పాన్-ఇండియా సినిమా. తెలంగాణ నేపధ్యంలో రానున్ననాని & కీర్తి సురేష్ ల సినిమాకి దసరా అనే టైటిల్ పెట్టారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. గోదావరి ఖని, బొగ్గు గనుల నడుమ నడిచే ఈ సినిమాకి ‘దసరా’ అనే ఒక పండుగ పేరు ఎందుకు పెట్టారో తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

అయితే ఇలా సినిమాలకి పండుగ పేర్లు పెట్టడం ఇదేమి మొదటి సారి కాదు. గతంలో కూడా కొన్ని తెలుగు సినిమాలకి పండుగ పేర్లనే సినిమా పేర్లుగా పెట్టారు. ఉగాది నుండి దసరా వరకు కొన్న్ని సినిమాలకి పెట్టిన పండుగ పేర్లు ఆ సినిమాలు ఏంటో ఓ సారి చూస్తే

1.భోగి మంటలు

1981 లో రిలీజ్ అయినా కృష్ణ గారి సినిమాకి భోగి మంటలు అనే పేరు పెట్టారు. సంక్రాంతి పండుగల్లో ఒకటి అయినా భోగికి ఈ సినిమా పేరు పెట్టారు.

2. విజయ దశమి

తమిళ సినిమా శివకాశి కి రీమేక్ గా వచ్చిన కళ్యాణ్ రామ్ మూవీ కి తెలుగులో లో విజయ దశమి అనే టైటిల్ పెట్టారు. వీ సముద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమా టైటిల్ లో విజయ దశమి ఉన్న సినిమా మాత్రం విజయం సాధించలేదు.

3. రాఖి

కృష్ణ వంశి దర్శకత్వంలో …జూ ఎన్టీఆర్, ఇలియానా, ఛార్మిలు నటించిన సినిమాకి రాఖి పండుగ టైటిల్ పెట్టారు. అన్న చెల్లెళ్ల కథ కావడం, సినిమాలో హీరో పేరు కూడా రామ కృష్ణ కావడంతో షార్ట్ కట్ లో రాఖి… కలిసి రావడంతో ఈ టైటిల్ పెట్టారు.

4. సంక్రాంతి

ఫ్యామిలీ సినిమా హీరోలు అయినా వెంకటేష్-శ్రీకాంత్ ఇద్దరు కలిసి నటించిన సినిమాకి తెలుగు పండుగ సంక్రాంతి పేరు పెట్టారు. పండుగ పేరు లాగే సినిమా కూడా కుటుంబం, విలువలతో కూడిన సినిమాగా హిట్ అయ్యింది.

5. ఉగాది

ఎస్వీ కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించి హీరో గా ఆక్ట్ చేసిన ఫ్యామిలీ డ్రామా సినిమా కి ఉగాది అనే టైటిల్ పెట్టారు. లైలా హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సినిమా పాటలు, సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది.

6. హోళీ

ఉదయ్ కిరణ్ & నువ్వే కావాలి ఫేమ్ హీరోయిన్ రిచా ఇద్దరు కలిసి చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాకి హోళీ అనే పండుగ పేరు పెట్టారు ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది.

7. కృష్ణాష్టమి

జోష్ సినిమా దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహించిన సినిమాకి కృష్ణాష్టమి అనే టైటిల్ పెట్టారు ఈ సినిమాలో సునీల్ హీరో గా చేసారు… దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా యావరేజ్ హిట్ అయ్యింది.

8 దసరా

ఇక ఇప్పుడు నాని & కీర్తి సురేషులు ఇద్దరు హీరో-హీరోయిన్లు గా వస్తున్న సినిమాకి దసరా అనే పండుగని టైటిల్ గా పెట్టారు. తెలంగాణలో పెద్ద పండుగ అయినా దసరా ని ఈ సినిమాకి టైటిల్ గా పెట్టడం వెనక కారణం ఏంటో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

9. దీపావళి

తమిళ్ లో జయం రవి & భావన ఇద్దరు నటించిన సినిమాకి దీపావళి అనే టైటిల్ పెట్టారు.

10. దుర్గాష్టమి

కన్నడ లో మహాలక్ష్మి,వజ్రముని , సత్యప్రియ, చేతన్ రాజ్ లాంటి నోటెడ్ కన్నడ యాక్టర్లు చేసిన డెవోషనల్ సినిమాకి దుర్గాష్టమి అనే టైటిల్ పెట్టారు.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus