10 సార్లు బాలయ్య చిరు ల మధ్య సంక్రాంతి ఫైట్.. ఎక్కువ గెలిచింది ఎవరంటే?

మన తెలుగు ప్రేక్షకులు ఏ పండుగనైనా.. సినిమాలతోనే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పండుగ రోజుల్లో కుటుంబంతో ఆనందంగా గడపడంతో పాటు కొంత టైం సినిమా థియేటర్లలో కూడా గడపడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. సినీ పరిశ్రమ చేసుకున్న అదృష్టం అది అని చెప్పొచ్చు. ఇక సంక్రాంతి సీజన్ వచ్చింది అంటే కోడి పందాలు, ముగ్గుల పోటీలు, భోగి మంటలు, పిండి వంటలు, జాతర్లతో పాటు.. సినిమా థియేటర్లలో కూడా జనాలు పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అనడంలో సందేహం లేదు.

అదే సంక్రాంతి సీజన్ లో చిరు – బాలయ్య వంటి పందెం కోళ్లు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగాయి అంటే.. ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కు ఎలాంటి మజా వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకానొక టైంలో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన స్టార్ డం వీరిది. అంతేకాదు కాలంతోనూ, జయాపజయాలతోనూ సంబంధం లేని స్టార్ డం కూడా వీరిదని చెప్పొచ్చు. మొత్తం ఈ అగ్ర హీరోలు 10 సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. మరి ఆ 10 సార్లు వీళ్ళు ఏ సినిమాలతో పోటీపడ్డారు? ఫలితాలు ఏమయ్యాయి.. అన్న విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) 1985 : ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి ‘చట్టంతో పోరాటం’ చిత్రంతో, బాలకృష్ణ ‘ఆత్మబలం’ చిత్రంతో పోటీ పడ్డారు. అయితే ఈ రెండు సినిమాలు ఆడలేదు. కమర్షియల్ గా ‘చట్టంతో పోరాటం’ గుడ్డిలో మెల్ల అన్నట్టు నిలబడింది.

2) 1987 : ఈ ఏడాది సంక్రాంతికి ‘దొంగ మొగుడు’ తో చిరంజీవి, ‘భార్గవ రాముడు’ తో బాలయ్య పోటీ పడ్డారు. అయితే విన్నర్ గా చిరంజీవి ‘దొంగ మొగుడు’ నిలిచింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.

3) 1988 : ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి ‘మంచి దొంగ’ తో.. బాలకృష్ణ ‘ఇన్స్పెక్టర్ ప్రతాప్’ తో పోటీ పడ్డారు. ఈసారి వీరిద్దరి సినిమాలు సక్సెస్ అందుకున్నాయి.





4) 1997 : ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి ‘హిట్లర్’ తో.. బాలకృష్ణ ‘పెద్దన్నయ్య’ తో పోటీ పడ్డారు. ఈసారి కూడా ఇద్దరూ సక్సెస్ సాధించారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.





5) 1999 : ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి ‘స్నేహం కోసం’ తో… బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ తో పోటీ పడ్డారు. ‘స్నేహం కోసం’ పెద్దగా ఆడలేదు. బాలయ్య ‘సమరసింహారెడ్డి’ మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.





6) 2000 : ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి ‘అన్నయ్య’ చిత్రంతో… బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’ చిత్రంతో పోటీ పడ్డారు. ‘అన్నయ్య’ సినిమా హిట్ అయ్యింది. ‘వంశోద్ధారకుడు’ ప్లాప్ గా మిగిలింది.





7) 2001 : ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి ‘మృగరాజు’ చిత్రంతో.. బాలకృష్ణ ‘నరసింహ నాయుడు’ చిత్రంతో పోటీ పడ్డారు. ‘నరసింహ నాయుడు’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ‘మృగరాజు’ డిజాస్టర్ అయ్యింది.





8) 2004 : ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి ‘అంజి’ చిత్రంతో .. బాలకృష్ణ ‘లక్ష్మీ నరసింహ’ చిత్రంతో పోటీ పడ్డారు. ‘అంజి’ డిజాస్టర్ గా మిగిలింది. ‘లక్ష్మీ నరసింహ’ సూపర్ హిట్ గా నిలిచింది.





9) 2017 : ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో.. బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రంతో పోటీ పడ్డారు. ‘ఖైదీ నెంబర్ 150’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా డీసెంట్ హిట్ అనిపించుకుంది.





10) 2023 : ఈ ఏడాది సంక్రాంతికి చిరు ‘వాల్తేరు వీరయ్య’ తో.. బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ తో పోటీపడనున్నారు. మరి ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus