విజయ్ నెక్స్ట్ ఆ డైరెక్టర్ తోనే… పాన్ ఇండియా లెవెల్లో…!

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘ఫైటర్’ అనే చిత్రం చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం రూపొందుతుంది. విజయ్ గత చిత్రాలు అయిన ‘నోటా’ ‘డియర్ కామ్రేడ్’ ….పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయ్యాయి కానీ సక్సెస్ కాలేదు. అయినప్పటికీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

పూరి కి బాలీవుడ్ లో క్రేజ్ ఉంది కాబట్టి… అందులోనూ పూరి తక్కువ బడ్జెట్ లోనే సినిమాని తెరకెక్కిస్తాడు కాబట్టి… ఆ ప్రాజెక్ట్ మినిమం గ్యారెంటీ అని చెప్పొచ్చు. అయితే విజయ్ మరో పాన్ ఇండియా సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ సినిమా బడ్జెట్ ఏకంగా 100కోట్లని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే… పూరి సినిమా పూర్తయ్యాక ‘మజిలీ’ దర్శకుడు శివ నిర్వాణ తో ఓ చిత్రం చేస్తున్నాడు విజయ్.

అది పూర్తయ్యాక ‘వి’ చిత్రం దర్శకుడు అయిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం 100 కోట్ల బడ్జెట్ పెట్టాల్సి వస్తుందట. విజయ్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రం ఒక్క ‘గీత గోవిందం’ మాత్రమే..! ఆ చిత్రం 70 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. మరి విజయ్ సినిమాకి 100కోట్ల బడ్జెట్ పెడుతున్నారు అంటే సాహసమనే చెప్పాలి.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus