డ్రగ్స్ కాంట్రవర్సీ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఉడ్తా పంజాబ్’ .. విడుదలకు ముందు సిబిఎఫ్‌సి నుంచి చిక్కులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మొదట 13, ఆ తరువాత 89 సన్నివేశాలను తొలగించాలని సిబిఎఫ్‌సి సూచించింది. సిబిఎఫ్‌సి నిర్ణయం పై చిత్ర నిర్మాతలు బాంబే హైకోర్టు ను ఆశ్రయించగా.
బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు కేవలం సింగిల్ కట్ తో ఈ చిత్రం విడుదల అయ్యింది. తాజాగా ఈ చిత్రం పాకిస్తాన్ లో విడుదల అవుతుండగా.. పాకిస్తాన్ సిబిఎఫ్‌సి ఈ చిత్రంలో నుంచి దాదాపు 100 సన్నివేశాలను తొలగించాల్సిందిగా చిత్ర డిస్ట్రిబ్యూటర్ కు ఆదేశించినట్లు సమాచారం.
అంతేకాకుండా పలు సన్నివేశాల్లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉన్న సంభాషణలు తొలగించాలని కూడా సూచించారట. పాక్ సిబిఎఫ్‌సి లో ఉన్న 10 మంది సభ్యులు కూడా ఈ చిత్రాన్ని వీక్షించగా.. సిబిఎఫ్‌సి హెడ్ ముభాసిర్ హసన్ సిబిఎఫ్‌సి బృందంతో కలిసి పై నిర్ణయాన్ని వెలువరించారు.