Balagam Movie: మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న ‘బలగం’

‘దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్’ బ్యానర్ పై శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత కలిసి నిర్మించిన చిత్రం ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు టిల్లు అలియాస్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు.ఎటువంటి అంచనాలు లేకుండా మార్చి 3న రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

‘చిన్న సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చినా.. ‘అవి అవార్డు సినిమాలు.. మంచి సినిమాలు’ అనే మాటల దగ్గరే ఆగిపోతాయి కానీ.. టికెట్లు తెగేలా జనాలను ప్రేరేపించవు’ అనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. కానీ ‘బలగం’ ఆ మాటలు తప్పని ప్రూవ్ చేసింది. ఈ సినిమా స్లో పాయిజన్ లా పనిచేసింది. ప్రేక్షకుల్ని థియేటర్లకు తీసుకురావడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యింది. థియేట్రికల్ పరంగా రూ.25 కోట్లు పైనే గ్రాస్ వసూళ్ళని రాబట్టింది ఈ చిత్రం.

అంతేకాదు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయినా థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడేలా చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు తెలంగాణలోని కొన్ని పల్లెటూర్లలో ‘బలగం’ చిత్రాన్ని వీధుల్లో ప్రదర్శించడం కూడా ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. ఇప్పుడు మరో అరుదైన ఘనతని కూడా ‘బలగం’ సాధించింది. ఈ చిత్రానికి ఇప్పటివరకు ఏకంగా 100 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు వచ్చాయట.

ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. ‘ఇప్పటి వరకు మనం 100 రోజుల సినిమాలు చూసాం, 100 కేంద్రాల్లో ఆడిన సినిమాలను చూసాం, రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలను కూడా చూసాం, మొదటిసారి 100 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులను గెలుచుకున్న సినిమాగా ‘బలగం’ గురించి చెప్పుకుంటున్నందుకు గర్వపడుతున్నాం’ అంటూ (Balagam) చిత్ర బృందం వెల్లడించింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus