ఏపీలో వంద శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్!

  • October 14, 2021 / 11:46 AM IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ థియేటర్లకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లను వంద శాతం ఆక్యుపెన్సీతో నడపొచ్చని ప్రకటన జారీ చేసింది. వంద శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం రేపటినుంచి(అక్టోబర్ 14) నుంచి అందుబాటులోకి రానుంది. కరోనా కారణంగా ఇన్ని రోజులు థియేటర్లలో ఆక్యుపెన్సీపై షరతులు విధిస్తూ వచ్చిన ప్రభుత్వం తాజాగా కరోనా కేసులు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా..

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల థియేటర్ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నాడు విడుదల కానున్న ‘మాహాసముద్రం’తో పాటు దసరాకు విడుదల కానున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘పెళ్లి సందడి’ సినిమాలకు కూడా ఈ వంద శాతం ఆక్యుపెన్సీ కలిసొస్తుందనే చెప్పాలి. ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు ఇప్పటికీ అమలు చేస్తున్న ప్రభుత్వం వాటిపై కూడా ఆంక్షలను కుదించింది. ఇకపై ఏపీలో రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

దీంతో సెకండ్ షో సినిమాకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకునే అవకాశం లభించింది. వంద శాతం ఆక్యుపెన్సీతో నాలుగు ఆటలంటే నిర్మాతలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus