‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాథే శ్యామ్’ అనే పీరియాడికల్ లవ్ డ్రామా చిత్రం చేస్తున్న ప్రభాస్ మరో రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న 50 వ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు.ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే తన 22వ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేసాడు.
గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో రెట్రోఫైల్స్ ప్రొడక్షన్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మైతిలాజికల్ సోషియో ఫాంటసీకి ‘ఆది పురుష్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. అంతేకాదు ఈయన కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఇదిలా ఉండగా.. ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణా మూవీస్’ వారు నిర్మిస్తుండగా..ఈ ప్రాజెక్టు కు 250కోట్ల బడ్జెట్ అవుతుందని సమాచారం. ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం బడ్జెట్ 400కోట్ల వరకూ అవుతుందట. ఇక ‘ఆది పురుష్’ చిత్రానికి 600 కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందని సమాచారం. సో మొత్తంగా ఈ 3 సినిమాలకు కలిపి 1000 కోట్ల పైనే బడ్జెట్ అవుతుంది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సూపర్ స్టార్ నటించిన 3 సినిమాలకు ఈ రేంజ్లో బడ్జెట్ పెట్టలేదు. దీంతో ప్రభాస్ క్రేజ్ ను చూసి బాలీవుడ్ హీరోలు కూడా భయపడుతున్నట్టు ఇన్సైడ్ టాక్.
Most Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!